Thursday, November 21, 2024

ఈ నెల 17న ‘ఏపీ కేబినెట్ మీటింగ్’..ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌..

అమ‌రావ‌తి ఈ నెల 17న ఏపీ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్లు గడుస్తుంది. దీంతో ఇదే ప్రస్తుత మంత్రులకు సంబంధించి చివరి సమావేశం అని టాక్. మరోవైపు ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముందు రోజు జరిగే మంత్రివర్గం సమావేశం అత్యంత కీలకంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాల్సిన పలు ముసాయిదా తీర్మానాలను మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలక బిల్లులను ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ఆమోదం పొందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 డిసెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల ప్రకటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేశారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాన్ని ప్రకటించారు. కానీ నాటి నుంచి నేటి వరకు ఈ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇంకా ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement