ఏపీలో మంత్రుల మార్పులు జరగనున్నాయా..అంటే ఔననే అనిపిస్తోంది. మంత్రులంతా బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఆనాడే సీఎం జగన్ మంత్రుల పదవుల గడువు రెండున్నర సంవత్సరాలని తెలిపారు. 90శాతం మార్పు ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మొత్తం కేబినెట్ లోని మంత్రులను మార్చాలని నిర్ణయించారు.అదే సమయంలో మంత్రులను తప్పించి..కొత్త వారిని తీసుకుంటారనే విషయం నిర్ధారణ అయిన సమయం నుంచి కొంత మంది మంత్రులు గతంలో లాగా యాక్టివ్ గా కనిపించటం లేదనే చర్చ వైసీపీలో వినిపిస్తోంది. జగన్ సైతం పార్టీ – ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులపైన పూర్తి స్థాయిలో నిఘా సంస్థతో పాటుగా ప్రైవేట్ సర్వేలు చేయించినట్లు టాక్. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనూ జగన్ వచ్చే ఎన్నికల గురించి ప్రస్తావించారు. ప్రశాంత్ కిషోర్ టీం వస్తోందని జగన్ స్వయంగా వెల్లడించారు.
కాగా ఇప్పటికే ఎమ్మెల్సీల కసరత్తు పూర్తి చేసిన జగన్ .. ఈ సారి ఎమ్మెల్సీలకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారనే టాక్ వినిపిస్తోంది.ఎన్నికలు అన్నీ కూడా పూర్తి కావటంతో సార్వత్రిక ఎన్నికల పైనే ఫోకస్ పెట్టాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా.. ముందుగా కేబినెట్ విస్తరణ పైన డేట్ ఫిక్స్ అయిందంటూ పార్టీలో ముఖ్యనేతల వద్ద చర్చ జరుగుతోంది. అందు కోసం గవర్నర్ అందుబాటులో ఉండే డేట్ కోసం ఆరా తీసిశారట. దీంతో రెండు డేట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నాయి. డిసెంబర్ 5 న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందని.. ఆ వెంటనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఈ డేట్ పైన ఇప్పటికే ప్రభుత్వంలోని ముఖ్యులు బలంగా నమ్మే ఒక ప్రముఖుడితో సైతం సంప్రదింపులు చేయగా..ఆ డేట్ కే ఆయన ఖరారు చేసినట్లు చెబుతున్నారు.ఆయన సూచన మేరకే కొత్త కేబినెట్ ..ప్రజల్లోకి ముఖ్యమంత్రి.. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం…పథకాల నిర్వహణ, తనిఖీలు వంటివి చేయటం ద్వారా సానుకూలత పెంచుకొనే ప్రయత్నాలు చేయనున్నారు. దీంతో.. డిసెంబర్ మొదటి వారం లేదా.. రెండో ముహూర్తంగా డిసెంబర్ మూడో వారంలో ఒక రోజు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. మరి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ సారి ఏం స్కెచ్ వేశారో తెలియాల్సి ఉంది..ఒక పక్క అన్న జగన్ కి..మరోపక్క చెల్లెలు షర్మిలకి ఐడియాలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily