ఏపీ,బీహార్ సీఎస్ లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు మధ్యాహ్నం 2గంటలకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు కూడా కోవిడ్ బారిన పడి మరణించిన వారి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించేలా ఏర్పాట్లు కూడా చేశాయి. అయితే పరిహారం అందించే విషయంలో మాత్రం జాప్యం ఏర్పడుతోంది. తాజాగా కోవిడ్ బారిన పడి మరణించిన వారికి ఇచ్చే పరిహారంలో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించే విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. పరిహారం చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..