బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ ముద్దుల పాప వామిక అల్లరి చేష్టలను ఎంజాయ్ చేస్తున్నారు. తన చిలిపి పనులు.. ముద్దు ముద్దు మాటలతో వారు సంతోసంగా గడుపుతున్నారు. వామికా చేష్టలు తమను ఆశ్చర్యపరుస్తున్నాయి అంటోంది అనుష్క. ‘‘వామ్మె.. అప్పుడే తను ఏదైనా చేయాలనుకుంటే.. ఆ పని వెంటనే చేసేస్తోంది..’’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది అనుష్క.. అది చూడటం తమకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించింది. ఎందుకంటే ‘‘నేను కూడా చిన్నప్పుడు అలానే ఉండేదాన్నిఅని మా పేరెంట్స్ చెప్పేవారు” అంటోంది అనుష్క శర్మ. తమ చిన్నారి వామికతో ఆడుకుంటున్న విరాట్, అనుష్క ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది.. అవిప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్లు, రీ ట్వీట్లతో షేర్ అవుతున్నాయి..
Advertisement
తాజా వార్తలు
Advertisement