టాలీవుడ్ బొమ్మాళి,టాలీవుడ్ దేవసేన..అందాల జేజమ్మ..ముద్దుగా స్వీటీ..ఇప్పటికే మీకు అర్థమయి ఉంటుంది కదా..ఆమె ఎవరనేది. ఆమె అనుష్కశెట్టి.. నవంబర్ 7 అనుష్క పుట్టినరోజు. 1981లో పుట్టిన ఈ భామ.. ఈ ఏడాదితో 40వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. అనుష్క ఫ్యామిలీలో ఎక్కువగా డాక్టర్స్..ఇంజనీర్సే ఉన్నారు. అనుష్క ఒక్కరే సినిమాలోకి వచ్చారు. అనుష్క ప్రాధమిక విద్యతో పాటు హైస్కూల్,కాలేజ్,డిగ్రీ మొత్తం మంగుళూరులోనే సాగింది.. . 2005లో “సూపర్” సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకి పరిచయం అయింది అనుష్క. ఈ చిత్రంలో అనుష్కని చూసిన ప్రేక్షకులు ఆమె నాజుకు అందాలకి ఫిదా అయిపోయారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీజగన్నాథ్ తెరకెక్కించాడు. పూరీ వల్లే అనుష్క టాలీవుడ్ కి పరిచయం అయింది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా అనుష్క కెరీర్ కి బాటలు వేశారు. అందుకే నాగార్జున నటించిన పలు చిత్రాల్లో గెస్ట్ రోల్ అయినా మెరుస్తుంటుంది ఈ కన్నడ బ్యూటీ.
సూపర్ చిత్రం తర్వాత హీరో సుమంత్ నటించిన మహానంది చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా క్రేజ్ తీసుకురాలేకపోయాయి. కాగా విక్రమార్కుడు చిత్రంలో మాస్ మహరాజ్ రవితేజకి జోడీగా నటించింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2009లో వచ్చిన అరుంధతి మూవీతో అనుష్క టాప్ హీరోయిన్ అయిపోయింది. యువరాణిగా అనుష్క అభినయానికి,అందానికి ప్రేక్షకులు మైమరచిపోయారు. దాంతో ఎంతోమంది అనుష్కని అభిమానించడం అనడం కంటే ఆరాధకులుగా మారిపోయారు.ఇక ఆ తర్వాత ‘రుద్రమదేవి’ చిత్రంలో తన రాజసాన్ని ఒలకబోసింది ఈ బ్యూటీ. తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మళ్లీ ఊపు తీసుకొచ్చిన హీరోయిన్ ఎవరంటే అనుష్క పేరే చెప్పాలి.. ఇక స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్నా కూడా వేశ్య పాత్రలో నటించడం , ఆ పాత్రకి ఎనలేని పేరురావడం తెలిసిందే. ఆ చిత్రం వేదం..
అయితే అరుంధతి లాంటి సినిమా తర్వాత వెంటనే బిల్లాలో బికినీ వేసిన ఘనత అనుష్క సొంతం. ఆ తర్వాత “పంచాక్షరి”, “రుద్రమదేవి”, “భాగమతి”, “సైజ్ జీరో” లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. మరోవైపు సింగం లాంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ గ్లామర్ ఒలకబోసింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ‘భాగమతి’గా పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ..హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ అనే సినిమా చేసింది. ఈ చిత్రం పెద్దగా ఆడలేదు.. ఆతర్వాత ఏ సినిమాకి సంతకం చేయలేదు అనుష్క..కాగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ఓ చిత్రంలో అనుష్క నటించనుందనే టాక్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు..
పాత్ర ఏదైనా..ఆ పాత్ర ఎటువంటిదైనా తనదైనశైలిలో ఆ పాత్రలో ఒదిగిపోయే తత్వం అనుష్కది. అంతేకాదు ఇండస్ట్రీలో అందరితో కలుపుగోలుగా ఉంటూ..అందరి మననలను పొందుతోంది ఈ కన్నడ సోయగం. ఈ భామకి సామాజిక సేవ చేయడం, ఇతరులకి సాయం చేయడం అంటే చాలా ఇష్టం. ఇక భక్తి కూడా ఎక్కువే. ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తుంది అనుష్క..అయితే 40ఏళ్లు వచ్చినా ఈ భామ ఇంకా కుమారిగానే వున్నారు. ఈ మధ్యకాలంలో అనుష్కకి వరుడుని వెతికే పనిలో కుటుంబసభ్యులు ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇక అనుష్క,,ప్రభాస్ ల మధ్య ఏదో నడుస్తోందని పుకార్లు వచ్చినా తాము స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అనుష్కది.. మరి ఈ ఏడాది అయినా అనుష్క పెళ్ళి చేసుకుంటుదేమో చూడాలి. అనుష్క ఇంకా మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటూ..ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఆంధ్రప్రభ.