కరోనాని ఐదు రోజుల్లో కట్టడి చేయగల యాంటీ వైరల్ డ్రగ్ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది. అది కూడా హైదరాబాద్ లోనే. దాని పేరు మోల్ను పిరావిర్ ఈ డ్రగ్ పేరు. ముందుగా హైదరాబాద్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. కాగా ఇవి 40ట్యాబ్లెట్స్ సుమారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల ధరను ఖరారు చేశారట. హైదరాబాద్ కు చెందిన అప్టిమస్ ఫార్మా భారత్ లో కోవిడ్-19 చికిత్స కోసం మోల్నుపిరావిర్ ను విడుదల చేసింది.80 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ కలిగిన వయోజన రోగుల కోసం మోల్నుపిరావిర్‌ను ఆమోదించింది. ఇకపై వ్యాక్సిన్ స్థానంలో ట్యాబ్ లెట్స్ అందుబాటులోకి రానున్నాయి.
అయితే ఈ మెడిసిన్ కు షరతులతో కూడిన ఆమోదం లభించింది. ఇండియాలో ఈ ట్యాబెట్లు తయారు చేసేందుకు 13 కంపెనీలు అనుమతి తీసుకోగా అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌కి చెందినవే కావడం గమనార్హం.మోల్నుపిరావిర్‌ని ఇండియాలో అందించేందుకు అనుమతి పొందిన 13 కంపెనీల్లో ఒకటైన ఆప్టిమస్ సంస్థ మోల్‌కోవిర్ పేరుతో ట్యాబ్లెట్లు తయారు చేసింది. వీటిని హైదరాబాద్ మార్కెట్లో రిలీజ్ చేసింది. జనవరి 3 నుంచి మిగిలిన నగరాల్లో క్రమంగా విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా మెల్నుపిరావిర్‌ని రేపోమాపో మార్కెట్లోకి తేవాలని ఆయా కంపెనీలు కూడా యుద్ధప్రతిపాదికన యత్నిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..