హైదరాబాద్, (ప్రభ న్యూస్) : సుప్రసిద్ధ ఔషద కంపెనీ ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ యాంటీ ఫంగల్ చికిత్సలో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రపంచంలో మొట్టమొదటి సూపర్ బయో ఎవైలబల్ ఇట్రాకోనజోల్ – ఎస్‌బీ100ఎంజీని ఇటాస్పార్ ఎస్‌బీ ఫోర్ట్, సుబావిన్ బ్రాండ్ పేరిట విడుదల చేసింది. సంప్రదాయ ఇట్రాకొనజోల్ ప్రధాన ఔషదం ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో జరిపే పోరాటం వైవిధ్యంగా ఉంటుదని, ఇటాస్పార్ ఎస్‌బీ ఫోర్ట్ తో రోగికి సత్వర ఉపశమనం లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డా.అలోక్ చతుర్వేది మాట్లాడుతూ సూపర్ బయోఅవైలబల్ (ఎస్‌బీ) సాంకేతికతతో రూపొందించబడిన 25 ఏళ్ల బ్రాండ్ ఇటాస్పోరిస్‌లోని ఇంటాస్ సూత్రీకరణతో 1ఇటాస్పార్ – ఎస్‌బీ క్యాప్సూల్, సంప్రదాయ 200 ఎంజీ ఇట్రా కోనజోల్‌తో సమానమని తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డా.డీ.ఖర్కర్ మాట్లాడుతూ సూపర్ బయోఅవైలబల్ (ఎస్‌బీ) సాంకేతికతతో చికిత్స ఖర్చు గణనీయంగా తగ్గడమనేది ప్రయోజనకరంగా ఉంటుదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement