Sunday, November 24, 2024

Train Tragedy | కవచ్​ లేకపోవడమే యాక్సిడెంట్​కు కారణమా?

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పదేండ్ల కాలంలో అతిపెద్దది అన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. శనివారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి మాట్లాడుతూ.. రైళ్లలో యాంటీ కొల్లిజన్ సిస్టమ్​ ‘కవచ్’​ అమర్చినట్లయితే ఈ ప్రమాదం జరగకుండా ఉండేది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన దుర్ఘటనలో బాధితులకు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, కేంద్ర మాజీ రైల్వే మంత్రి బెనర్జీ ₹5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

అత్యుత్తమ ఎక్స్ ప్రెస్ రైళ్లలో కోరమాండల్ ఒకటి. నేను మూడుసార్లు కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశాను. నేను చూసిన దాని ప్రకారం.. ఇది 21వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదం. ఇలాంటి కేసులను రైల్వే భద్రతా కమిషన్‌కు అప్పగించారు. వారు దర్యాప్తు చేసి నివేదిక ఇస్తారు. నాకు తెలిసినంత వరకు ట్రైన్‌లో యాంటీ-కొలిజన్ డివైజ్ లేదు.. ఆ డివైస్ ట్రైన్‌లో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు.. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేము కానీ, ఇప్పుడు మా పని బాధితులకు సత్వరమే వైద్యం అందించే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయడమే.. మళ్లీ రైళ్లు నడిచేలా సాధారణ స్థితికి తీసుకురావడం అని మీడియాతో మమతా బెనర్జీ అన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ఒడిశా రైలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. నిన్న దేశాన్ని కుదిపేసిన బాలాసోర్ రైలు దుర్ఘటనలో 400మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పి, గూడ్స్ రైలుని ఢీకొట్టింది. దీంతోపాటు రెండు ప్యాసింజర్ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు ప్యాసింజర్ రైళ్లు- బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, కోరమాండల్ ఎక్స్ ప్రెస్.. బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్‌లో మూడు వేర్వేరు ట్రాక్‌లపై వస్తున్నాయి.. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ప్యాసింజర్ రైళ్ల 21 కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

- Advertisement -

స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రాథమిక నివేదిక ప్రకారం 900 మందికి పైగా గాయపడ్డారు. నివేదిక ప్రకారం మరణాల సంఖ్య 380 నుండి 400కి పెరిగింది. ఏడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, ఐదు ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) యూనిట్లు, 24 ఫైర్ సర్వీసెస్, ఎమర్జెన్సీ యూనిట్లు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి. ఘటనాస్థలిని సందర్శించిన పలువురు నేతలు.. ఒడిశా రైలు దుర్ఘటనలో బాధితులకు ₹ 10 లక్షల పరిహారం అందివ్వనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement