ఇండియా అమ్ముల పొదిలో మరో వెపన్ చేరబోతోంది. బాలాసోర్ తీరంలో సుదూర శ్రేణి సూపర్‌సోనిక్ మిస్సైల్ సహాయక టార్పెడోను భారత్ ఇవ్వాల (సోమవారం) సక్సెప్‌ఫుల్‌గా పరీక్షించింది. ఇండియన్ నేవీ కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) ఈ వెపన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోందని రక్షణ అధికారి ఒకరు తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్ తీరంలో లాంగ్ రేంజ్ సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పెడో (స్మార్ట్)ని విజయవంతంగా పరీక్షించినట్టు చెప్పారు. “టార్పెడో యొక్క సాంప్రదాయ పరిధికి మించి యాంటీ-సబ్ మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థ రూపొందించాం” అని DRDO ఒక ప్రకటనలో తెలిపింది.
క్షిపణి యొక్క లక్ష్యాలను చేరుకోవడంలో DRDO, భారత వైమానిక దళం (IAF) నిర్వహించిన విమాన-పరీక్ష “విజయవంతమైంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. IAF కోసం అభివృద్ధి చేసిన ఈ వెపన్ 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నిర్వీర్యం చేయగలదని పేర్కొంది.