Tuesday, November 19, 2024

Monkeypox: మంకీపాక్స్​పై మరో అప్​డేట్​.. ముద్దులు, హగ్గులతోనూ డేంజరే!

ప్రపంచ దేశాలను భయపెడుతున్న మంకీ పాక్స్​పై వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​ (డబ్ల్యూహెచ్​వో) మరో అప్​డేట్​ ఇచ్చింది. ఇప్పటిదాకా స్వలింగ సంపర్కుల నుంచి మంకీపాక్స్​ సోకుతున్నట్టు ఆరోపణలుండేవని, అదంతా బూటకమిని తెలిపింది. అయితే.. ముద్దులు, హగ్గులు, లిప్​లాక్​ వంటివే కాకుండా.. మంకీ పాక్స్​ సోకిన వారితో సెక్స్​ వంటి అంశాలు కూడా చాలా డేంజర్​ అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి ఈజీగా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

‌‌– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

LGBTQ కమ్యూనిటీని చెడుగా చూపించే బూటకాన్ని డబ్ల్యూహెచ్​వో కొట్టిపారేసింది.  LGBTQ కమ్యూనిటీలలో ఉన్న ఆరోగ్య క్లినిక్‌లలో కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ఇంతకుముందు WHO తన ప్రకటనలో తెలిపింది. అయితే.. ఇప్పుడు మరో ప్రకటన రిలీజ్​ చేస్తూ  మంకీపాక్స్ ప్రమాదం పురుషులతో సెక్స్​ సంబంధం కలిగి ఉన్న వారికి మాత్రమే పరిమితం కాదని గమనించాలని కోరింది. అంటువ్యాధి ఉన్న వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్టేనని తెలిపింది. ఏ లైంగిక ధోరణి లేదా జాతితో సంబంధం లేకుండా మంకీపాక్స్ సన్నిహిత శారీరక సంపర్కం నుండి వ్యాపిస్తుంది. అయితే ఓన్లీ LGBTQలు మంకీపాక్స్ ‘స్ప్రెడర్స్’ కాదని డబ్ల్యూహెచ్​వో ప్రకటన స్పష్టం చేస్తోంది.

 “సెక్స్ చేసేటప్పుడు స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ సమయంలో మంకీపాక్స్ వ్యాపిస్తుంది. ఇందులో లక్షణాలున్న వారితో ముద్దులు పెట్టుకోవడం, తాకడం, నోటితో, సెక్స్ వంటి పలు అంశాలు ఉంటాయి. లక్షణాలు ఉన్న వారితో సన్నిహితంగా ఉండొద్దు”అని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులలో కొన్ని మంకీపాక్స్​ వ్యాధి లక్షణాలు నమోదవడంతో ఇటీవల LGBTQ కమ్యూనిటీలో ఇది కాస్త భయాన్ని పెంచింది.

ఒక అమెరికన్ కరెంట్ అఫైర్స్ చానెల్ నివేదికలో ఉదహరించబడినట్లుగా.. “మంకీపాక్స్ అనేది క్లాసిక్ కోణంలో STI కాదు. ఎందుకంటే ఇది లైంగిక సంపర్కం సమయంలో వీర్యం, రక్తం లేదా శారీరక ద్రవాల ద్వారా వ్యాపించదు. వైరస్ సాధారణంగా శ్వాసకోశ, ఇతర శ్లేష్మ మార్గాలు.. బిందువుల ద్వారా వ్యాపిస్తుంది”అని టెక్సాస్ A&M విశ్వవిద్యాలయంలోని అంటు వ్యాధి నిపుణుడు రెబెక్కా ఫిషర్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement