ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీలకి ఝలక్ ఇస్తున్నారు ఆయా పార్టీల నేతలు. తాజాగా ముగ్గురు బిజెపి క్యాబినెట్ మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బిజెపి నుంచి సమాజ్ వాదీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఏకంగా ఎస్పీ అధినేత ములాయం సింగ్ కోడలినే బిజేపీలో చేర్చుకుని ఎస్పీ పార్టీకి భారీ షాక్ ని ఇచ్చారు. ఇప్పుడు ఎస్పీ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఎస్పీ నాయకుడు శివచరణ్ ప్రజాపతి లక్నోలో బీజేపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బరేలీకి చెందిన ట్రిపుల్ తలాక్ బాధితురాలు నిదా ఖాన్ కూడా బీజేపీలో చేరారు. త్రిపుల్ తలాక్ చట్టం తీసుకువచ్చినందుకు, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నందుకు బీజేపీలో చేరానని నిదాఖాన్ వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement