వరల్డ్ కప్ లో హేమా హేమీలు అనుకున్న జట్లు పసికూనల చేతుల్లో ఓటమి పాలవుతున్నాయి. మొన్న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుని ఆఫ్గాన్ చిత్తు చేసింది. ఇక.. ఇవ్వాల మరో సంచలనం నమోదయ్యే చాన్స్ కనిపిస్తోంది. ధర్మశాలలో వర్షం వల్ల లేటుగా ప్రారంభమైన మ్యాచ్ లో… తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అయితే, చేజింగ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
ఇక.. 11.2 ఓవర్లలో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు.. 25 ఓవర్ల వరకు కీలకమైన 6 వికెట్లను కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో కెప్టెన్ బవుమా (16), క్వింటన్ డికాక్ (20), వాన్ డర్ డుస్సెన్ (4), ఐడెన్ మార్ క్రమ్ (1), క్లాసేన్ (28), మార్కో జాన్సేన్ (9) పరుగులు చేసి పెవిలియన్ పట్టారు. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఇద్దరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న దశలో వాన్ బీక్ బౌలింగ్ లో క్లాసెన్ అవుటయ్యాడు. ఆ తర్వాత క్లాసేన్, జాన్సేన్ కూడా అవుటయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా ఆరు వికెట్లు చేజార్చుకుంది. 25 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 111 పరుగులుగా ఉంది.. ఇంకా 102 బంతుల్లో 134 పరుగులు చేయాల్సి ఉంది..
ఇక.. నెదర్లాండ్స్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ వాన్ డెర్ మెర్వ్ 2 వికెట్లు, వాన్ మీకెరెన్ 2, వాన్ బీక్ 1, అకెర్ మన్ 1, వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో కోయిట్జీ, డేవిడ్ మిల్లర్ ఉన్నారు.
ఇంగ్లండ్‌పై గెలిచిన ఆనందంలో ఆఫ్గానిస్తాన్ జట్టు