Tuesday, November 26, 2024

భార్య ఇందిర‌ ఉండగానే మ‌రో వివాహం.. విజయనిర్మలను కృష్ణ ఎట్లా పెళ్లి చేసుకున్నారంటే!

బంధాలు ఎప్పుడు, ఎవరితో.. ఎలా మొదలవుతాయో చెప్పలేం. కృష్ణ-విజయనిర్మల పరిచయం, ప్రేమ, వివాహం కూడా అట్లాంటిదే. వృత్తిపరంగా క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించిన‌ విజయనిర్మల-కృష్ణ వ్యక్తిగతంగా కూడా దగ్గరయ్యారు. కలిసి బ‌తకాలని నిర్ణయించుకున్నారు. అయితే..సినిమాల్లోకి రాకముందే కృష్ణ-ఇందిరాదేవిల వివాహం జరిగింది. 1962లో చదువు పూర్తయ్యాక వివాహం జరిపించారు. కాగా, సినిమాపై ఇష్టంతో కృష్ణ మద్రాసు వెళ్లి ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఆయన 1965లో విడుదలైన తేనెమనసులు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.

ఇక‌.. గూఢచారి, సాక్షి సినిమాలు కృష్ణకు బ్రేక్ ఇచ్చాయనే చెప్పొచ్చు. అవి సూపర్ హిట్స్ కావడంతో ఆయనకు నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల నుంచి పెద్ద పెద్ద‌ ఆఫర్స్ రావ‌డం ప్రారంభ‌మైంది. దర్శకుడు బాపు తెరకెక్కించిన సాక్షి మూవీలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు. ఆ మూవీలో కృష్ణ, విజయనిర్మల కెమిస్ట్రీ వెండితెరపై అద్భుతంగా ఉండ‌డం.. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త వారి మ‌ధ్య ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగేలా చేసింది.

విజయనిర్మల వ్యక్తిత్వం, తెలివితేటలు నచ్చిన కృష్ణ ఒకరోజు గుడిలో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయితే.. ఇక్క‌డ మ‌రో విష‌యం చెప్పుకోవాలి. విజయనిర్మలకు కూడా అప్ప‌టికే పెళ్ల‌య్యింది. నరేష్ మొదటి భర్తకు కలిగిన సంతానం. ఆమెకు మొదటి భర్తతో విబేధాలు ఉన్నాయి. కృష్ణ‌తో జ‌రిగిన ఈ రహస్య వివాహాన్ని త‌న మొదటి భార్య ఇందిరాదేవి వద్ద కృష్ణ దాచలేదు. విజయనిర్మలను పెళ్లి చేసుకున్నట్లు తానే డైరెక్ట్‌గా చెప్పేశారని వారి కుటుంబ విష‌యాలు తెలిసిన పెద్ద‌లు చెబుతుంటారు. విజ‌య నిర్మ‌ల‌ను పెళ్లి చేసుకున్నార‌నే మాట విన్న ఇందిరాదేవి ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయారట. కృష్ణ అభిప్రాయాన్ని గౌర‌విస్తూ.. వారి బంధానికి తన అంగీకారం తెలిపారట.

- Advertisement -

అయితే.. ఇందిరాదేవిలోని మరో గొప్ప విషయం ఏంటంటే.. ఆమె సవతి అయిన విజ‌య‌నిర్మ‌ల‌ను కూడా అంగీకరించడం. భర్తతో విభేదించకుండా కలిసి ఉన్నారు. కృష్ణ అభిప్రాయాలను, ఇష్టాలను గౌరవిస్తూ గొప్ప సతీమణిగా ఇందిరాదేవి నిరూపించుకున్నారు. అయితే ఏనాడూ ఇందిరాదేవి బ‌య‌టి ప్ర‌పంచానికి పెద్ద‌గా తెలియ‌కుండా ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉండి పోయారు. ఆమె నేమ్, ఫేమ్ కోరుకోలేదు. భార్యగా, తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ… లోప్రొఫైల్ మెయింటేన్ చేశారు. కృష్ణ భార్య ఎవ‌రు? అని అడిగితే టక్కున విజయనిర్మల అని చెప్పేవారే ఎక్కువ. త‌న మొదటి భార్య ఇందిరాదేవి గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువేన‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక‌.. రెండో వివాహం చేసుకున్నప్పటికీ తన భర్తగా కూడా కొనసాగాలని ఇందిరాదేవి కోరుకున్నారట . ఆ విధంగా కృష్ణ విజయనిర్మల, ఇందిరా దేవితో సాన్నిహిత్యం కొనసాగించారు. ఇందిరాదేవి-కృష్ణకు ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు తో పాటు పద్మజ, మంజుల, ప్రియదర్శి అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కుటుంబ ప‌రంగానూ ఓ గొప్ప మ‌నిషిగా సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement