గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి 132 మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరువకముందే.. ఉత్తరప్రదేశ్‌లో ఇవ్వాల (సోమవారం) అట్లాంటిదే మరో ఘటన జరిగింది. యూపీలోని చందౌలి జిల్లా సరయ్యా గ్రామంలో ఛఠ్ పూజ సందర్భంగా ఓ కాలువపై నిర్శించిన బ్రిడ్జిపైకి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాతబడిన ఆ వంతెన బరువును తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయంగానీ, ఎవరూ గాయపడటంగానీ జరుగలేదు.
వంతెన కూలిన సమయంలో కాలువలో ప్రవాహం పెద్దగా లేకపోవడం, ఎవరూ నీళ్లలో పడిపోకుండా కూలిన వంతెనపైనే ఉండడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. గుజరాత్, యూపీ ఘటనలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది.