తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. హైదరాబాద్‌లో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ (బీవీఎస్) సంస్థ జీనోమ్ వ్యాలీలో 200 కోట్ల రూపాయలతో టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావన్ గుల్.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ఈ విషయాన్ని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినందుకు ఎండీ సంజీవ్ నావన్ గుల్‌కు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యతో ప్రపంచంలోనే వ్యాక్సిన్ హబ్‌గా హైదరాబాద్ నగరం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని కేటీఆర్ పేర్కొన్నారు.