మరోసారి టర్కీలో భూమి కంపించింది.4.7గా రిక్టర్ స్కేల్ పై నమోదయింది. టర్కీ దక్షిణ నగరమైన కహ్రామన్మరాస్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఏమైనా నష్టం సంభవించిందా అన్న వివరాలు తెలియరాలేదు. టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద అణువణువు గాలిస్తున్న బృందాలు సజీవంగా ఉన్న వారిని వెలికి తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. టర్కీ, సిరియాల్లో శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని సహాయక బృందాలు నిన్న కూడా రక్షించాయి. భూకంప మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ప్రస్తుతం 34 వేలు దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 1939లో టర్కీలో సంభవించిన భూకంపం కంటే ఇది అత్యంత దారుణమైనదని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement