అసోంలో మరోసారి భూకంపం సంభవించింది. కాంరూప్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. తెల్లవారుజామున 3.59 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని పేర్కొంది. భూ ప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న జనాలు ఉక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. కాగా, గత నెల 14వ తేదీన అసోంలోని నాగోస్ ప్రాంతంలో తొలిసారి భూమి కంపించింది. ఇక, 19వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లో ఇలానే భూకంపం సంభవించింది. అలాగే, గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో గత నెల 28వ తేదీన రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement