అసెంబ్లీలో రవాణాశాఖ పద్దు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శివశంకర్ కొత్త రాయితీలు ప్రకటించారు. రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు తమిళనాడు రవాణా శాఖ మంత్రి శివశంకర్ ప్రకటించారు. రాయితీతో కూడిన సీజన్ టిక్కెట్లు ఇకపై ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని మంత్రి వెల్లడించారు. చెన్నై, తిరుచ్చి, విల్లుపురం రవాణా మండలాల్లోని బస్ డిపోల స్థాయి పెంచి ఆధునికీకరణ చేయనున్నట్లు శివశంకర్ తెలిపారు. ఈ డిపోల్లో బస్సులు శుభ్రం చేసేందుకు ఆటోమేటిక్ విధానాన్ని అమలుచేస్తామని మంత్రి చెప్పారు. ఈ సౌకర్యం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ డిపోల్లో ప్రభుత్వ శాఖల వాహనాలకు మరమ్మతు నిర్వహించేలా ఆధునిక మొబైల్ డిపోలను రూపొందించనున్నట్లు శివశంకర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రవాణా సంస్థలన్నింటినీ సమైక్యపరచి ప్రయాణికుల సౌకర్యార్ధం సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నామని మంత్రి చెప్పారు.
తమిళ సర్కార్ మరో నిర్ణయం – ప్రభుత్వ బస్సుల్లో ఐదేళ్లలోపు పిల్లలకి ఫ్రీ జర్నీ
Advertisement
తాజా వార్తలు
Advertisement