Sunday, September 8, 2024

ఇండియాకు మ‌రో చాలెంజ్.. కివీస్ తో రేపటి నుంచి T-20 సిరీస్…

ప్ర‌బ‌న్యూస్: భారత్‌-న్యూజిలాండ్‌ ద్వైపాక్షిక సిరీస్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. భారత పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌ ఆతిథ్య టీమిండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ రేపు జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో జరగనుంది. తొలి టీ20 కోసం భారత్‌ ఇప్పటికే జైపూర్‌ చేరుకుంది. జైపూర్‌లో భారత్‌కు ఇదే తొలి టీ20 కావడం విశేషం. జైపూర్‌లో 8 ఏళ్ల తర్వాత మ్యాచ్‌ జరగనుంది. ఇంతకుముందు భారతజట్టు జైపూర్‌లో 12వన్డేలు, ఓ టెస్టు ఆడింది. 12వన్డేల్లో 8మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించగా ఏకైక టెస్టు డ్రాగా ముగిసింది. కాగా తొలి టీ20 మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులను స్టేడియంలోకి అనుమతించనున్నారు.

మాత్రమే మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతిస్తామని రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పేర్కొంది. అయితే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. నవంబర్‌ 17న జైపూర్‌లో తొలి టీ20, 19న రాంచీలో రెండో టీ20, ఈ నెల 21న మూడో టీ20 కోల్‌కతాలో జరగనుంది. మూడు టీ20 మ్యాచ్‌లు రాత్రి 7గంటలకు ప్రారంభం కానున్నాయి. టీ20 సిరీస్‌ ముగిసిన అనంతరం 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మొదలవుతుంది.

కోహ్లీ టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలకడంతో రోహిత్‌శర్మ తొలిసారి టీ20సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసిన తర్వాత ద్రవిడ్‌కు ఇదే తొలి సిరీస్‌ కానుంది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టుకు రహానె సారథ్యం వహించనున్నాడు. టీ20 సిరీస్‌ తోపాటు తొలి టెస్టుకు దూరంగా ఉండనున్న కెప్టెన్‌ కోహ్లీ రెండో టెస్టుకు జట్టులో చేరనున్నాడు. తొలి టెస్టు ఈ నెల 25న కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో జరగనుం డగా, రెండో టెస్టు డిసెంబర్‌ 3నుంచి 7వరకు ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. టెస్టు మ్యాచ్‌లు రెండు ఉదయం 9.30నుంచి మొదలుకానున్నాయి.

భారత్‌ టీ20 జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌, శ్రేయస్‌అయ్యర్‌, సూర్యకుమార్‌, పంత్‌ (వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, చాహల్‌, ఆర్‌ అశ్విన్‌, అక్షర్‌పటేల్‌, ఆవేశ్‌ఖాన్‌, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్‌పటేల్‌, సిరాజ్‌.

భారత్‌ టెస్టు జట్టు: రహానె (కెప్టెన్‌), పుజారా (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌గిల్‌, శ్రేయస్‌అయ్యర్‌, సాహా (వికెట్‌కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌కీపర్‌), రవీంద్రజడేజా, ఆర్‌ అశ్విన్‌, అక్షర్‌పటేల్‌, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, ప్రసిధ్‌కృష్ణ.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement