Saturday, November 23, 2024

హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జ్.. సిటీ జనానికి ఇంకో టూరిజం స్పాట్!​

హైదరాబాద్ సీక్రెట్ లేక్ అని పిలిచే దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ తో జీహెచ్​ఎంసీ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ బ్రిడ్జ్ నగరవాసులకు, పర్యాటకులకు మైలురాయిగా మారింది. 2020 సెప్టెంబర్ లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మంత్రి KTR ప్రారంభించారు. ఈ వంతెన ద్వారా సిటీలో పర్యాటకం బాగా డెవలప్​ అయ్యిందనే చెప్పవచ్చు. అయితే.. ఇప్పుడు హైద‌రాబాద్ లో మ‌రో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్లాన్​ షురువైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఇప్పుడు మీర్ ఆలం ట్యాంక్ మీదుగా కేడుల్ బ్ర‌డ్జ్ నిర్మాణం కోసం ప్లాన్ చేస్తోంది. పాతబస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ మీదుగా ఈ రెండో కేబుల్-స్టేడ్ వంతెనను త్వ‌ర‌లో నిర్మించ‌బోతున్నారు.

మీర్ ఆలం ట్యాంక్ వంతెన 2.5 కిలోమీటర్ల పొడవు, ఆరు లేన్‌లతో ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ బ్రిడ్జ్ సెంట్రల్ స్పాన్ 350 మీటర్లు, పైలాన్లు 100 మీటర్ల ఎత్తులో ఉంటాయి. డిమార్ట్-గురుద్వారా-కిషన్‌బాగ్-బహదూర్‌పురా క్రాస్‌రోడ్స్ మార్గంలో భాగంగా ఈ వంతెన బెంగళూరు జాతీయ రహదారిని, అత్తాపూర్ సమీపంలోని చింతల్‌మెట్‌తో కలుపుతుంది. ఇక ఈ బ్రిడ్జితో ట్రాఫిక్‌ను సులభతరం చేయడమే కాకుండా చాలా మందికి రాకపోకలు కూడా ఈజీ అవుతాయి. అంతే కాకుండా బ్రిడ్జి పై నుంచి నీటి వనరుల అద్భుతమైన వ్యూ ని కూడా చూడ‌వ‌చ్చు అని HMDA అధికారులు తెలిపారు.

మీర్ ఆలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. రద్దీగా ఉండే బెంగళూరు జాతీయ రహదారి-చింతల్‌మెట్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ బ్రిడ్జి వల్ల ఓల్డ్ సిటీ కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణకు సంబంధించిన సమస్యలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement