Friday, November 22, 2024

తెర‌పై మ‌రో బ‌యోపిక్- సినిమాగా అట‌ల్ బిహారీ వాజ్ పేయి జీవిత చ‌రిత్ర‌

ఈ మ‌ధ్య‌కాలంలో బ‌యోపిక్ ల‌కి ఆద‌ర‌ణ పెరుగుతోంది. రియ‌ల్ స్టోరీల‌ని రీల్ స్టోరీలుగా తెర‌కెక్కించి స‌క్సెస్ సాధిస్తున్నారు ప‌లువురు ద‌ర్శ‌కులు. కాగా ఇప్పుడో రాజ‌కీయ నేత జీవిత చ‌రిత్ర తెర‌కెక్క‌నుంది. ఆయ‌నే వాజ్ పేయి..కాగా వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత బీజేపీ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. అనంత‌రం ఎంపీగా ఎంపికయ్యారు. 1968 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఏడుసార్లు ఎంపీగా, రెండేళ్లు మంత్రిగా సేవలందించారు. 1996 నుంచి 2004 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. దాదాపు ఎనిమిదేళ్లు ప్రధానిగా పనిచేశారు. ఆయన్ని భారత ప్రభుత్వంభారతరత్నతో గౌరవించింది దివంగత బీజేపీ నాయకుడు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జీవితం ఆధారంగా అటల్‌ అనే సినిమాని రూపొందించబోతున్నారు.మై రహూ యా నా రహూ ఏ దేశ్‌ రెహనా చాహియే- అటల్‌అనేది సినిమా పూర్తి టైటిల్‌. ఈ బయోపిక్‌ని కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.

ఉల్లేక్‌ ఎన్‌పీ రాసినది అన్‌టోల్డ్ వాజ్‌పేయి పొలిటీషియన్‌ అండ్‌ పారాడాక్స్్‌ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వినోద్‌ భన్సాలీ, సందీప్‌ సింగ్‌ నిర్మాతలు. దర్శకత్వం ఎవరు వహిస్తారనేది క్లారిటీ లేదు. ఈ సినిమాకి సంబంధించి మరో కొత్త అప్‌డేట్‌ వినిపిస్తుంది. ఇందులో వాజ్‌పేయి పాత్రలో బాలీవుడ్‌ విలక్షణ నటుడు పంకజ్‌ త్రిపాటి నటించబోతున్నట్టు తెలుస్తుంది. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో పంకజ్‌ ముందుంటారు. క్యారేక్టర్‌ ఆర్టిస్ట్ గా, విలన్‌గా అనేక సినిమాలు చేశారు. ఆయన మాజీ ప్రధాని పాత్రలో కనిపించబోతున్నారనే వార్త బాలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది. అదే సమయంలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. వాజాపేయి పాత్రకి బాగా సూట్‌ అవుతారని, సరైన న్యాయం చేస్తారని అంటున్నారు. మరి ఆయన నటిస్తున్నారనే వార్తల్లోనిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది(2023) డిసెంబర్‌ 25న విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement