Tuesday, November 19, 2024

Breaking: హైదరాబాద్​లో మరో అతిపెద్ద కంపెనీ.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

హైదరాబాద్‌లో ఎక్స్ పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవ్వాల (మంగళవారం) ప్రారంభించారు. ఎక్స్ పీరియన్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జాకీ సిమండ్స్, ఎక్స్ పీరియన్ ఇండియా కంట్రీ మేనేజర్ నీరజ్ ధావన్, ఇతర గ్లోబల్ లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎక్స్‌పీరియన్ అనేది ప్రపంచంలోని ప్రముఖ ప్రపంచ సమాచార సేవల సంస్థ. దాని క్లయింట్‌లకు డేటా, విశ్లేషణాత్మక సాధనాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 44 దేశాల్లో ఎక్స్ పీరియన్ బలమైన ఉనికిని కలిగి ఉంది. కాగా, మంత్రి KTR సారధ్యంలో మరో పెద్ద సంస్థ హైదరాబాద్​కి రావడం సంతోషంగా ఉందని పలువురు వ్యాపారవేత్తలు  అభినందిస్తున్నారు. తెలంగాణలోని ఉపాధి సమస్యను పరిష్కరించడానికి, ప్రపంచవ్యాప్తంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో IT, పరిశ్రమలను ఎలా స్థాపించాలన్న విషయమై మంత్రి కేటీఆర్​ నిరంతరం ఆలోచిస్తారని, అందుకే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్​ బాట పడుతున్నాయని టెకీలు కొనియాడుతున్నారు.  

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement