బిగ్ బాస్ సీజన్ 5 తొమ్మిదో వారం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం కెప్టెన్ గా అనీ మాస్టర్ అయ్యారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో విలన్ టీం గెలవడంతో ఆ టీం సభ్యులు కెప్టెన్సీ పోటీదారలుగా నిలిచారు. వారి కోసం బిగ్‌బాస్ ‘చిక్కకు దొరకకు’ టాస్క్ ఇచ్చాడు. విలన్స్ జట్టు సభ్యులు వెల్క్రో జాకెట్ ధరించి మిగిలిన ఇంటి సభ్యులు విసిరే బంతులను తమకు అంటుకోకుండా తప్పించుకోవాల్సి ఉంటుంది. బజర్ మోగే సమయానికి ఎవరికి ఎక్కువ పాయింట్లు ఉన్న బంతులు అంటుకుని ఉంటే వాళ్లు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు.
ఈ పోటీ ఆసక్తికరంగా సాగింది. రవి, సిరి, సన్నీ, అనీ మాస్టర్లు కెప్టెన్ టాక్ లో పోటీ పడ్డారు. వీరిలో ఒక్కొక్కరు ఔటు అయ్యారు. అనంతరం అనీ మాస్టర్ గెలిచారు. దీంతో ఈ వారం ఆమె కెప్టెన్ అయ్యారు. అయితే ఈ టాస్క్‌లో సమయంలో సిరి, షణ్ముఖ్‌కి మళ్లీ యుద్ధం జరిగింది. కెప్టెన్ షణ్ముఖ్ తనపై బంతులు విసరడంతో సిరికి కోపం వచ్చింది. దీంతో షణ్ముఖ్ పై కోసంతో ఏడుస్తూ కూర్చుంది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సర్ది చెప్పేందుకు షణ్ముఖ్ ప్రయత్నించగా.. ‘నువ్వు ఫేక్ ఫ్రెండ్‌వి.. నా ముందు నుంచి వెళ్లిపో’అంటూ అతడిపై అరిచింది. దీంతో వీరి మధ్య దూరం పెరిగింది.
ఇది కూడా చదవండి: ప్రజాసంకల్పానికి నాలుగేళ్లు.. సంక్షేమ, ప్రగతి పాలనకు పునాదులు