Tuesday, November 26, 2024

కోడి పందాలపై నిషేధం.. పక్కాగా అమలు చేయాలి: జంతు సంక్షేమ బోర్డు

సంక్రాంతి పండుగకు కోడి పందాలు నిర్వహించొద్దని జంతు సంక్షేమ బోర్డు ఆంధ్రప్రదేశ్ డీజీపీని కోరంది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఇండియా ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కోడి పందేలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

కోడి పందాలను నిర్వహించొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలని, ఆ ఆదేశాలు పాటించకుండా నిర్లక్ష్యం చేసే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) హెచ్చరించింది. ఏడబ్ల్యూబీఐ అనుమతి ఇవ్వడం, అలాంటి కార్యక్రమాలను నిర్వహించడం కోర్టు ధిక్కారంతో సమానమని తెలిపింది.

కాక్ ఫైటింగ్ నిషేధం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సంక్రాంతి కోడిపందాల కోసం వందలాది బరులు నిర్మిస్తున్నారని.. ఇది భారత సుప్రీంకోర్టు, హైదరాబాద్‌లో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేట ఆరోపించింది. “కోడి పందెంలో ఉపయోగించే పుంజులకు పదునైన కత్తులు అమర్చబడి ఉంటాయి. ఇవి మాంసం, ఎముకలను చీల్చివేస్తాయి. వాటితో పాటు కొన్నిసార్లు ప్రాణాంతకమైన గాయాలను కలిగిస్తాయి” అని PETA చీఫ్ అడ్వకేసీ ఆఫీసర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. గతేడాది తెలంగాణలో అక్రమ కోడిపందాల కోసం కత్తి కట్టిన కోడి పుంజు వల్ల నిర్వాహకుడు చనిపోయాడని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement