రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కిరాయికి ఉన్న ఇంటినుంచి ఖాళీ చేయించారనే కోపంతో ఓ జంట ఆ ఇంటి ఓనర్ని, మరో పాపను దారుణంగా చంపేసిన ఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని నందిగామలో ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినట్టు తెలుస్తోంది. కాగా, తొమ్మిదేండ్ల బాలిక సహా వృద్ధురాలిని దారుణంగా చంపేశారు దుండగులు.
నెల రోజుల క్రితం నందిగామలోని పార్వతమ్మ ఇంట్లో ఓ జంట రెంట్‌కు దిగింది. అయితే.. తమను ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో మర్డర్‌కి ప్లాన్ చేశారు ఇద్దరు భార్యభర్తలు. పార్వతమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమెతో పాటు ఆమె ఇంట్లో ఉన్న పాపను గొంతుకోసం హత్యచేశారు. అంతేకాకుండా బీరువా పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందితులు దివాకర్, అంజలిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.