Friday, November 22, 2024

‘అంగ‌న్ వాడి స్కూల్’ లో క‌లెక్ట‌ర్ పిల్ల‌లు..ఏంటా క‌థ‌..

గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగ‌స్తుల‌కు అన్ని సౌక‌ర్యాలు ఉంటాయ‌ని..వారు ఏం కోరుకున్నా వారి ముందుకు వ‌చ్చి ప‌డుతుంద‌ని తెలుసు. అదే ఉన్న‌త ప‌ద‌విలో ఉన్నవార‌యితే వేరే చెప్పాలా..రాజ‌భోగ‌మే..ఈ మ‌ధ్య తెలంగాణకు చెందిన కలెక్టర్ , కలెక్టరు భార్యని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు..ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ప్రైవేట్ వాటికంటే ఏ విధంగా తక్కువ కాదంటూ చెప్పకనే తమ తీరుతో చెప్పేశారు. అయితే తాజాగా మరో జిల్లా కలెక్టర్ తన ఇద్దరు కుమారైల‌ను అంగన్ వాడి కేంద్రానికి పంపిస్తూ.. పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ సంఘ‌ట‌న కుమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కలెక్టరు రాహుల్‌రాజ్‌ కు ఇద్దరు కుమార్తెలు. అయితే ప్రస్తుత సమాజంలో సామాన్యులు సైతం తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్స్ లో చదివించాలని భావిస్తున్నారు. తమ ఆర్ధిక పరిస్థితి అందుకు సహకరించకపోయినా అప్పు చేస‌యినా పిల్ల‌ల్ని చ‌దివించాల‌నే రీతిలో తల్లిదండ్రుల ఆలోచనలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కలెక్టరు రాహుల్‌రాజ్‌ తన ఇద్దరు కుమార్తెలు నిర్వికరాజ్‌, రిత్వికరాజ్‌లను అంగన్‌వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. ఈ ఇద్దరు చిన్నారులు జన్కాపూర్‌-1 కేంద్రంలోని తమ తోటి పిల్లల్తో ఆడుతూపాడుతూ చిన్న చిన్న పదాలను వల్లే వేస్తూ.. సంతోషంగా గడుపుతున్నారు. ఇదే విషయంపై అంగన్ వాడీ టీచర్ అరుణ మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా కలెక్టర్ పిల్లలు అంగన్ వాడీ కేంద్రానికి వస్తున్నారని.. ఇక్కడ పెట్టె భోజనమే తింటున్నారు చెప్పారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టరు రాహుల్‌రాజ్‌ పై నెటిజన్లు మీరు పలువురికి స్ఫూర్తి అంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.నిజంగా మార్పు మంచిదే..ఇలాంటి వారివ‌ల్లే అవ‌గాహ‌న అనేది ఏర్ప‌డుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement