అంగన్ వాడీ ప్రీ స్కూల్ లో తమ కుమారుడిని జాయిన్ చేశారు కలెక్టర్ కోటేశ్వరరావు. కర్నూలు జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కోటేశ్వరరావు, స్వర్ణలత దంపతులకు దివి అర్విన్ కుమారుడు. స్వర్ణలత హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తమ కుమారుడు ఆర్విన్‌ను అంగన్వాడీ ప్రీ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడి పిల్లలతో కలిసి ఆర్విన్ బొమ్మలకు రంగులు దిద్దుకుంటూ, ఆట వస్తువులతో ఆడుకుంటూ సరదాగా కనిపించాడు. అంతేకాదు కలెక్టర్ కోటేశ్వరరావు ఆర్భాటాలకు దూరంగా ఉంటారని స్థానికులు తెలిపారు. కలెక్టర్ కుమారుడు తమ అంగన్వాడీలో చేరడం గర్వంగా ఉందని అక్కడ గ్రేడ్1 సూపర్వైజర్ అంటున్నారు. అర్విన్ ఉదయం 10 గంటలకు స్కూల్‌కు వచ్చి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటున్నాడు. ఆదర్శాలు అందరూ చెబుతుంటారు.. వాటిని ఆచరణలో చూపించేవారు కొందరే ఉంటారు. వారిలో కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు కూడా ఒకరిగా నిలిచారని స్థానికులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పించిన వసతులు బాగున్నాయని.. స్థానిక ప్రజలకు తెలిసేలా చేసేందుకు కలెక్టర్ తతన కుమారుడినే బ్రాండ్ అంబాసిడర్ గా చేశారని చెప్పుకుంటున్నారట.
Advertisement
తాజా వార్తలు
Advertisement