Saturday, November 16, 2024

Spl Story: ఆండ్రాయిడ్​ ఆటో యాప్ ఆపేస్తున్నట్టు ప్రకటించిన గూగుల్.. కారు జర్నీలో ఇక కష్టమే!

అద్భుతమైన ఆలోచనలతో రక రకాల యాప్ప్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇట్లాంటి వాటిలో చాలా యాప్స్​ స్మార్ట్ ఫోన్‌లను అసాధారణ పరికరాలుగా తీర్చిదిద్దునున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు అద్బుతాలు సాధించవచ్చన్న కుతూహలాన్ని యూజర్లలో కలిగిస్తున్నాయి. ఈ యాప్స్ సహాయంతో స్మార్ట్ ఫోన్‌ను చిన్న సైజు కంప్యూటర్‌లా వాడుకునే వెసులుబాటు కలుగుతోంది.

అయితే.. ఆండ్రాయిడ్ స్మార్ట్​ఫోన్లలో గూగుల్​ యాప్స్​ ఇంపార్టెన్స్​ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత థర్డ్​పార్టీ యాప్స్​ కూడా బాగానే రన్​ అవుతాయి. కానీ, ఆపిల్​ సంస్థ తీసుకొచ్చే ఐఫోన్​లో ఉన్న ఐఓఎస్​లో మాత్రం ధర్డ్​పార్టీ యాప్స్​కి అవకాశమే ఉండదు. ఎందుకంటే ఆపిల్​ సంస్థ తమ ఓన్​ యాప్స్​కి మాత్రమే యాక్సెస్​ ఇస్తుంది. వాటి ద్వారా తక్కువ పవర్​ యూజ్​ అయ్యేలా ఎన్​క్రిఫ్ట్​ చేస్తుంది.

ఇక.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై రన్ అయ్యే స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్​ ఆటో (Android Auto) అనే యాప్​ ఒకటి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్​ని గూగుల్​ సంస్థ వర్క్​ చేయకుండా ఆపేస్తోంది. ఎందుకంటే దాన్ని ఆండ్రాయిడ్​ 12 వర్షన్​లో పనిచేయదని గూగుల్​ ముందే ప్రకటించింది. దీంతో ఆండ్రాయిడ్​ 12 వర్షన్​తో పాటు.. పాత వర్షన్​లలోనూ ఆండ్రాయిడ్​ ఆటో పనిచేయడం లేదు.

మెర్సిడెస్-బెంజ్, కాడిలాక్, చేవ్రొలెట్, కియా, హోండా, వోల్వో, వోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ వంటి అనేక హై ఎండ్​ మోడల్​ కార్లలో ఆండ్రాయిడ్​ ఆటో యాప్​ని ఎక్కువగా వినియోగిస్తుంటారు.  

ఆండ్రాయిడ్​ ఆటో అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

- Advertisement -

ఆండ్రాయడ్​ ఆటో అనేది గూగుల్​ తీసుకువచ్చిన ఓ ప్రత్యేకమై ఆప్​. ఇది స్మార్ట్​ ఫోన్లలో కార్లను ఆటోమెటిక్​గా లాక్​, అన్​లాక్​ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కారులో జర్నీ చేస్తున్నప్పడు ఆటోమెటిక్​గా ఆ కారులోని సిస్టమ్​కి కనెక్ట్​ కావడమే కాకుండా ఫోన్​ కాల్స్​, వీడియోలు, ఎంపీత్రీ ప్లేయర్​ వంటి అనే యాప్స్​ని రన్​ చేసుకునే ప్రొజెక్షన్ లా ఉపయోగపడుతుంది. ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్‌లోని ముఖ్యైమైన యాప్స్ ను కార్ స్ర్కీన్ పైకి తీసుకువస్తుంది. డ్రైవింగ్ సమయంలో వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌తో పనిలేకుండా నేరుగా తమ కారులోని డాష్ బోర్డ్ ద్వారానే ఇంటర్నెట్‌, మ్యూజిక్, మ్యాప్స్, యాప్స్, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, జీపీఎస్​ ట్రాకింగ్ వంటి అనేక అంశాలను యాక్సెస్ చేసుకోవచ్చు.

కాగా, Android 12లో ఫోన్ స్క్రీన్‌ల కోసం Android Auto ఆపేస్తున్నట్టు Google గత ఏడాది ఆగస్టులో తెలిపింది. ఫస్ట్​  Android 12 బీటా వెర్షన్‌లోనే కంపెనీ చెప్పినట్లే ఆండ్రాయిడ్​ ఆటో అనేది పనిచేయకుండా ఆపేసింది. ఇప్పుడు Android 12 వర్షన్​ రన్​ అవుతున్న అన్ని స్మార్ట్​ ఫోన్లు, గ్యాడ్జెట్స్​లో Android Autoని కంప్లీట్​గా నిలిపివేసింది. అయినప్పటికీ కొన్ని వర్షన్​లను వినియోగిస్తున్న వారు ఈ పీచర్​ని యాక్సెస్​ చేస్తున్నట్టు తెలుసుకున్న గూగుల్​ ఆండ్రాయిడ్ ఆటోని కంప్లీట్​గా పనిచేయకుండా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.  

ఆండ్రాయిడ్ 11 లేదా అంతకంటే ఓల్డ్​ వర్షన్​లను వినియోగిస్తున్న పరికరాల్లో కూడా దీన్ని వాడడానికి వీలుండదు. వినియోగదారు యాప్‌ని ఓపెన్​ చేయడానికి ట్రై చేస్తే.. సెట్టింగ్స్​ పేజీ ఓపెన్​ అవుతున్నట్టు చాలామంది చెబుతున్నారు.  దీనికి ప్రత్యామ్నాయంగా వినియోగదారులు ఇప్పుడు Google అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్‌ను ఎంచుకోవచ్చంటున్నారు టెక్​ ఎక్స్​పర్ట్స్​. ఈ ఫీచర్​ 2019లో విడుదలైంది. తర్వాత 2020లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2021 ప్రారంభం వరకు విస్తరిస్తూనే ఉంది. కానీ, ఆండ్రాయిడ్ ఆటో వచ్చిన తర్వాత దీన్ని వాడడం ఆపేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement