ఏపీలో కరోనా విజృంభిస్తోంది. కాగా ఏపీలో కొత్తగా 6వేల, 996కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా ఈ వైరస్ సోకి నలుగురు మృతి చెందారు. ఏపీలో మొత్తం 21లక్షల,17వేల 384కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా 14వేల, 514మంది మృతి చెందారు.36వేల, 108యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 20లక్షల,66వేల,762మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కట్టడికి ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించినా అప్పటికిని వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గటం లేదు. ఇక తాజాగా ఏపీలో మరో సారి కరోనా కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో కొత్తగా 6996 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17, 384 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో నలుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 514 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 36108 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1066 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement