Saturday, November 23, 2024

COVID-19 vaccine: వ్యాక్సినేషన్ లో ఏపీ నెంబర్ వన్!

దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పిటికే దేశంలో 150 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. ప్రస్తుతం దేశంలో 15-18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్లు అందిస్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా టీనేజర్ల వ్యాక్సినేషన్ లో ఏపీ తొలి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా కరోన కేసులు పెరుగుతున్న వేళ జనవరి 3వ తేదీ నుంచి కేంద్రం టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టింది. అయితే, తొలి అయిదు రోజుల్లోనే ఏపీలో నిర్దేశించిన లక్ష్యంలొ 72 శాతం పూర్తి చేసింది. ఇతర రాష్ట్రాల కంటే దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ 50 శాతానికి పైగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేసిన రాష్ట్రాల జాబితాలో ఏపీ, హిమాచల్‌ప్రదేశ్‌లు మాత్రమే ఉన్నాయి.

మొత్తం 2.02 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్ డోస్‌లలో 1.57 కోట్ల టీకాలు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్‌లు కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనూ 50 శాతానికి మించి టీకా పంపిణీ పూర్తి కాలేదు. అయితే, ఏపీలో నిర్దేశించిన లక్ష్యంలొ 72 శాతం పూర్తి చేసింది. రాష్ట్రంలో కేవలం 28 శాతం మందికి మాత్రమే టీకా వేయాల్సి ఉంది. రాష్ట్రంలో అర్హులైన 24,41,000 మంది పిల్లలకు వారం రోజుల్లో టీకా పంపిణీ పూర్తిచేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. శుక్రవారం నాటికి 17,52,581 మందికి టీకాలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో టీకాలు వేయడంతో పాటు విద్యా సంస్థల వద్దకు ఆరోగ్య సిబ్బంది వెళ్లి మరీ టీకాలు వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement