Thursday, November 21, 2024

టీడీపీ అధినేత చంద్రబాబుకు నేడు పోలీసుల నోటీసులు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కర్నూలు నుంచి కరోనా N440K వైరస్ వ్యాపించింద‌ని చంద్రబాబు చేసిన కామెంట్లపై జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప స్పందించారు. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై న్యాయవాది సుబ్బయ్య నుంచి తమకు ఫిర్యాదు అందింద‌న్నారు. ఈ వ్యవహారంలో ఆదివారం నాడు నోటీసులు ఇస్తామని చెప్పారు. ఏడు రోజుల్లోపు విచార‌ణ‌కు హాజరు కావాలని ఆదేశిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదుతో చంద్ర‌బాబుపై క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయ‌న… కరోనాపై చేస్తున్న దుష్ప్రచారం వల్లే జనం భయాందోళనకు గురవుతున్నారని పోలీసుల‌కు న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కర్నూలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబుపై Cr.No. 80/2021 ప్రకారం.. ఐపీసీ 155, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసు పెట్టారు. 2005 ప్రకృతి వైప‌రీత్యాల చట్టంలోని సెక్షన్‌ 4 కింద నాన్‌బెయిల్‌ కేసు నమోదు చేశామని కర్నూలు జిల్లా పోలీసులు చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement