ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 22,204 కేసులు నమోదయ్యాయి. ఇక కొత్తగా 85 మంది చనిపోయినట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,06,232కి చేరుకోగా.. మరణాల సంఖ్య 8,374కి చేరింది. అటు కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి పూట కర్ఫ్యూతో పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఏపీలో 1,70,588 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు: శ్రీకాకుళం-1,982, విజయనగరం-1,202, విశాఖ-2,113, తూ.గో.-2,344, ప.గో.-1,304, కృష్ణా-1,138, గుంటూరు-1,972, ప్రకాశం-2,001, నెల్లూరు-1,200, చిత్తూరు-1,756, అనంతపురం-2,304, కడప-903, కర్నూలు-1,985.