Wednesday, November 20, 2024

రాజధాని పిటిషన్లపై నేడే విచారణ

ఏపీలో రాజధాని వికేంద్రీకణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరుపనుంది. జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ నిర్వహించనున్నారు.

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన 54 వ్యాజ్యాలపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. గత నవంబరు, డిసెంబర్​లో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. రాజధాని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపింది. జస్టిస్ మహేశ్వరి బదిలీతో ఆ వ్యాజ్యాల విచారణ నిలిచిపోయాయి. దీంతో రాజధాని వ్యాజ్యాలపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గతేడాది గవర్నర్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధానిగా, అలాగే, అమరావతి శాసన రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక, సీఆర్డీఏ పరిధిలో తాము చేయాలనుకున్న పనులకు పాత చట్టం అడ్డుగా ఉంది. ఆ చట్టంలో నిబంధనలను అనుకూలంగా తీసుకుని కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్డీఏ కూడా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement