ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది. జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 1 నుంచి 31వరకు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. అలాగే జూన్ 1 నుంచి 5 వరకు పాఠశాలలకు రిపోర్టు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. జూన్ 7 నుంచి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సహకరించాలని టీచర్లకు సూచించింది. సెలవుల్లో విద్యార్థులకు డిజిటల్ మార్గాల ద్వారా.. సందేహాలు తీర్చాల్సిందిగా సూచనలిచ్చింది ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాల్సిందిగా రీజినల్ డైరెక్టర్లను ఆదేశించింది.
ఏపీలో విద్యార్ధులకు సమ్మర్ హాలీడేస్
By mahesh kumar
- Tags
- Andhra Pradesh government
- coronavirus
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- minister adimulapu suresh
- Most Important News
- ssc students
- summer holidays
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement