Friday, November 22, 2024

ఏపీలో ఒక్కరోజులో 20,034 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 20,034 కేసులు నమోదయ్యాయి. ఇక కొత్తగా 87 మంది చనిపోయినట్లు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైరస్ నుంచి కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరుగుతుందని, కొత్త ఆస్పత్రుల కోసం రూ.346 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యం కోసం 21,850 బెడ్లు ఉన్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

కాగా తాజా కేసులతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 11,84,028కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 8289కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 1,59,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు: శ్రీకాకుళం-2,398, విజయనగరం-1,075, విశాఖ-1,976, తూ.గో.-1,075, ప.గో.-1,258, కృష్ణా-998, గుంటూరు-1,678, ప్రకాశం-1,741, నెల్లూరు-1,160, చిత్తూరు-2,318, అనంతపురం-2,168, కడప-793, కర్నూలు-1,396.

Advertisement

తాజా వార్తలు

Advertisement