Wednesday, November 20, 2024

Andhra Prabha’s Special Story – చంద్ర‌యానం 1958 – 2023….జాబిలి పైకి చ‌లో…చ‌లో..

1958లో అమెరికా ప్రారంభించిన పయనీర్‌–0 నుంచి నేటి చంద్రయాన్‌ 3 వరకు చంద్రుడిపై అన్వేషణలకు అప్రతి హతంగా ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూఎస్‌ఎ, యూఎస్‌ఎస్‌ఆర్‌లు వడివడిగా వేసిన అడుగులు నేడు చైనా, భారత్‌ వంటి దేశాల చొరవతో మరింత వేగం పుంజుకున్నాయి. జాబిల్లి లోని చీకటి కోణాల్ని ఛేధించబోతున్నాయి. నాడు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా వేసిన మొదటి అడుగు 77 సెకన్లకే విఫలమైనప్పటికీ, ఆ తర్వాతి ప్రయత్నాలు జాబిల్లిపై కాలుమోపేందుకు వీలుకల్పిం చాయి. అమెరికా పయనీర్లు, లూనార్‌ ఆర్బిటర్లు, అపోలోలు, రేంజర్లు, సర్వేయర్లు, ఆర్టెమిస్‌ నుంచి యూఎస్‌ఎస్‌ఆర్‌ ప్రయోగిం చిన లూనాలు, స్పుత్నిక్‌, జోండ్‌, కాస్మోస్‌ల దాకా చంద్రుడివైపు సాహసయాత్రలో కీలక మైలురాళ్లుగా నిలిచాయి.
1950వ దశకం నంచి ఇప్పటి వరకు చంద్రుడు లక్ష్యంగా 146 ప్రయోగాలు జరిగాయి. 13 దేశాలు జాబిలి గురించి అన్వేషణకు ప్రయత్నించాయి. ఈ జాబితాలో యూఎస్‌ఎ, యూఎస్‌ఎస్‌ఆర్‌ (రష్యా), చైనా, ఇండియా, జపాన్‌ తోపాటు యూఏఈ, ఇజ్రాయెల్‌, ఈక్వెడార్‌, లగ్జెంబర్గ్‌, దక్షిణ కొరియా, ఇటలీ తదితర దేశాలు న్నాయి. యూఎస్‌ఎ 58, యూఎస్‌ ఎస్‌ఆర్‌ 59 ప్రయత్నాలతో ముందంజలో ఉండగా, చైనా 8, జపాన్‌ 6 భారత్‌ 3 తర్వాతి స్థానా ల్లో నిలిచాయి. యుఎస్‌ ఎస్‌ఆర్‌ విచ్ఛిన్నమైన తర్వాత రష్యా చేపట్టిన ఏకైక ప్రయోగం లూనా-25 విఫలమైంది. ఇప్పటి వరకు జా బిలిని చేరేందుకు జరిగిన కొన్ని కీలక ప్రయోగాల గురించి సంక్షిప్త వివరణ.

లూనా 2
ఈ మానవర#హత సోవియట్‌ ప్రోబ్‌ మరొక గ్రహాన్ని చేరుకున్న మొదటి మానవ నిర్మిత వస్తువుగా నిలిచింది. గోళాకార అంతరిక్ష నౌక సెప్టెంబర్‌ 12, 1959న ప్రారంభించ బడింది. రెండు రోజుల తర్వాత చంద్రునిపైకి చేరింది.

లూనా 3
ఇది లూనా-2కి కొనసాగింపు. అక్టోబర్‌ 4, 1959న ప్రయో గించారు. చంద్రుడి ఫొటోలు తీసిన మొదటి అంతరిక్ష నౌకగా నిలిచింది.

రేంజర్‌ 7
అమెరికా అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన 4300 ఫొటోలు తీసింది. అధిక నాణ్యతతో కూడిన చంద్రుడి ఫొటోలు భూమికి చేర్చిన ఘనత దీనిదే. జూలై 28, 1964న ప్రారంభించబడిన ఈ మిషన్‌ మేఘాల్లో కూలిపోయింది.

8లూనా 9
చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయిన తొలి మానవరహత సోవియట్‌ ప్రోబ్‌. లూనా 9 ఫిబ్రవరి 3, 1966న, చంద్రుని బిలంలోకి ప్రవేశించింది. అక్కడి అపురూప చిత్రాలను భూమికి పంపింది.

లూనా 10
ఇది మార్చి 31, 1966న ప్రయోగించబడింది. రెండు రోజుల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. రెండు నెలల వ్యవధిలో 460 సార్లు చంద్రుడిని చుట్టివచ్చింది. మరొక ఖగోళ వస్తువును విజయవంతంగా కక్ష్యలో ఉంచిన మొదటి మానవ నిర్మిత అంతరిక్ష నౌకగా నిలిచింది.

- Advertisement -

6సర్వేయర్‌ 1
లూనా సాఫ్ట్‌ల్యాండింగ్‌ తర్వాత నాలుగు నెలలకు దీనిని అమెరికా ప్రయోగించింది. జూన్‌ 1966లో చంద్రునిపై నియంత్రిత పద్ధతిలో ల్యాండ్‌ అయింది. ఆరు వారాల వ్యవధిలో సర్వేయర్‌ 1 చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన 11,100 చిత్రాలను క్లిక్‌మనిపించింది.

లూనార్‌ ఆర్బిటర్‌ 5
మనుషులతో కూడిన అపోలో ల్యాండింగ్‌లకు సన్నాహకంగా చేపట్టిన మానవర#హత మూనిమిషన్ల శ్రేణిలో భాగం. లూనార్‌ ఆర్బిటర్‌ 5 మిషన్‌ ద్వారా చంద్రుని ఉపరితలం 99 శాతం మ్యాప్‌ చేయబడింది. ఈ అంతరిక్ష నౌక ఆగస్ట్‌ 1, 1967న ప్రయోగించబడింది. జనవరి 31, 1968న తన మిషన్‌ను పూర్తి చేసింది.

అపోలో 8
డిసెంబర్‌ 21, 1968న, నాసా వ్యోమగాములు ఫ్రాంక్‌ బోర్మాన్‌, జేమ్స్‌ లోవెల్‌, విలియం ఆండర్స్‌ చంద్రుడిని సందర్శించిన మొదటి మానవులు. వీరు డిసెంబర్‌ 24, 1968న చంద్ర కక్ష్యలోకి వెళ్లారు. భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించిన మొదటి వ్యక్తులు వీళ్లే. ఈ ముగ్గురు వ్యోమగాములు డిసెంబర్‌ 27, 1968న భూమికి తిరిగి వచ్చారు.

అపోలో 11
అంతరిక్ష పోటీలో సోవియట్‌తో వెనుకబడిన అమెరికా ఎట్టకేలకు వేగం పుంజుకుంది. చంద్రునిపై మొదటి సారి మానవుడిని దించింది. నాసా వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్‌ ఆల్డ్రిన్‌ జూలై 20, 1969న జాబిలిపై కాలుమోపారు. వీరితోపాటు వెళ్లిన మైఖేల్‌ కాలిన్స్‌ అపోలో కమాండ్‌, సర్వీస్‌ మాడ్యూల్‌లో పైన కక్ష్యలోనే ఉండిపోయాడు. ఈ ముగ్గురూ జూలై 24, 1969న తిరిగి భూమ్మీదకు వచ్చారు.

లూనా ్వ16
సోవియట్‌ యూనియన్‌ మానవరహత ప్రయోగాల పరంపర కొనసాగించింది. సెప్టెంబర్‌ 12, 1970న లూనా 16ని చంద్రుని ఉపరితలంపై దించింది. చంద్రుని రాళ్లను సేకరించి వాటిని భూమికి చేర్చింది.

లునోఖోడ్‌
సోవియట్‌ లునోఖోడ్‌1 చంద్రునిపై ప్రయాణించిన మొదటి జాబిల్లి రోవర్‌. లూనా 17 మిషన్‌లో భాగంగా నవంబర్‌ 10, 1970న రోవర్‌ మానవరహతంగా ప్రయోగించింది. చంద్రుడిని తాకిన తర్వాత, రిమోట్‌-నియంత్రిత వాహనం 6 మైళ్లు (10.5 కిలోమీటర్లు) ప్రయాణించి, ఫోటోలు, వీడియో తీసింది.

లూనార్‌ ప్రాస్పెక్టర్‌
నాసా మానవరహత వ్యోమనౌక జనవరి 7, 1998న చంద్ర ధృవాల వద్ద శాశ్వతంగా నీడ ఉన్న క్రేటర్లలో నీటి మంచు, ఇతర ఖనిజాల ఆచూకీని వెతకడానికి చంద్రుని చుట్టూ తిరిగింది. 19 నెలల వ్యవధిలో, ప్రోబ్‌ జూలై 31, 1999న క్రాష్‌ ల్యాండింగ్‌కు ముందు ఉపరితలంపై ఖనిజ కూర్పు మ్యాప్‌ను సంకలనం చేసింది.

స్మార్ట్‌-1
యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నుండి వెళ్లిన మొదటి చంద్ర మిషన్‌. మానవరహత స్మార్ట్‌-1 ప్రోబ్‌ సెప్టెంబర్‌ 27, 2003న ప్రారంభించబడింది. నవంబర్‌ 2004లో చంద్ర కక్ష్యకు చేరుకుంది. ఈ చిన్న వ్యోమనౌక సౌర విద్యుత్‌ శకి ద్వారా అయాన్‌ ఇంజిన్‌తో చంద్రుడిపై నడిచింది.

కగుయా (ఎస్‌ఇఎల్‌ఇఎన్‌ఇ)
చంద్రునిడి మీదకు ఈ జపనీస్‌ మిషన్‌ సెప్టెంబర్‌ 14, 2007న దూసుకెళ్లింది. 30 రోజుల లోపే చంద్ర కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ అంతరిక్ష నౌక ఇప్పటికీ అక్కడే ఉంది. చంద్రుని గురుత్వాకర్షణ క్షేత్రానికి సంబంధించిన అత్యంత వివరణాత్మక మ్యాప్‌ను సంకలనం చేస్తోంది.

కెపిఎల్‌ఒ
కొరియా పాత్‌ఫైండర్‌ లూనార్‌ ఆర్బిటర్‌ను 2022లో దక్షిణ కొరియా ప్రయోగించింది. ప్రాథమిక అన్వేషణ సామర్థ్యాలను స్థాపించే లక్ష్యంతో సాంకేతిక ప్రదర్శనతో మిషన్‌ ప్రారంభించింది. అంతరిక్ష నౌక సైన్స్‌ పేలోడ్‌లో నాసా అందించిన షాడోక్యామ్‌ అనే పరికరం ఉంది.

క్యాప్‌స్టోన్‌
నాసా ఫండింగ్‌, టెక్నాలజీ ఇది రూపు దిద్దుకుంది. ఈ అధునాతన క్యాప్‌స్టోన్‌ అంతరిక్ష నౌక నాసా నేతృత్వంలోని అంతర్జాతీయ గేట్‌వే స్టేషన్‌ ఉపయో గించే ఏకైక ఇంధన-పొదుపు దీర్ఘవృత్తా కార చంద్ర కక్ష్య సాధ్యతను నిరూ పించడానికి ఉద్దేశించబడింది.

చేంజ్‌-5
చైనా అంతరిక్ష మిషన్‌ చేంజ్‌-5 చంద్రుని నమూనాలను భూమికి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ మిషన్‌ ఇప్పుడు దీర్ఘకాల చంద్ర కక్ష్యలో ఉంది.

చంద్రయాన్‌-2
చంద్రయాన్‌-2 అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలం కూర్పు, నీటి, మంచు ఆనవాళ్లను తెలుసుకునేందుకు ప్రయో గించబడింది.
చేంజ్‌-5, యుటు-2 చైనాకు చెందిన చేంజ్‌-4 మిషన్‌ ల్యాండింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ను, యుటు-2 అనే రోవర్‌ను చంద్రుడి అవతలి ప్రాంతంపై దృష్టిసారించింది.

లూనార్‌ రికనైసెన్స్‌ ఆర్బిటర్‌
లూనార్‌ రికనైసెన్స్‌ ఆర్బిటర్‌ అనేది చంద్రుని ఉపరితలాన్ని మ్యాపింగ్‌ చేసే నాసా రోబోటిక్‌ మిషన్‌. ఎల్‌ఆర్‌ఒ చంద్రుని గురించిన డేటాను సేకరించింది. అనేక సంచలనాత్మక ఆవిష్కరణలను ప్రారంభించింది.

చంద్రయాన్‌-3
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ చివరి అంకానికి చేరుకుంది. జులై 14న బయల్దేరిన వ్యోమనౌక దశల వారీగా కక్ష్యలు మార్చుకుంటూ చంద్రుడికి దగ్గరగా వెళ్లింది. నేడు జాబిల్లి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగనుంది. ఈ చరిత్రాత్మక క్షణాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపరూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement