Monday, November 25, 2024

నలంద, విక్రమశిల వర్సిటీల పురాతన సాహిత్యం.. నేటి తరానికి అందించే ప్రక్రియ ప్రారంభం

12, 13వ శతాబ్దాల్లో పురాతన విశ్వవిద్యాలయాలను భక్తియార్ ఖిల్జీ సైన్యం తగులబెట్టింది. ఆ సమయంలో నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాల నుంచి వందలకొద్దీ అసలైన బౌద్ధ మాన్యుస్క్రిప్ట్ లను భద్రపరిచారు. అయితే ఇప్పుడు వాటిని అనువదించి, ప్రచురించే ప్రక్రియ జరుగుతోంది.. ఈ విషయాన్ని బిహార్ మంత్రి సన్యాసి రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు. సారనాథ్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ (సిఐహెచ్‌టిఎస్) ఈ ప్రక్రియను ప్రారంభించిందని బిహార్ ఆర్ట్ అండ్ కల్చర్ మంత్రి అలోక్ రంజన్ అసెంబ్లీలో తెలిపారు. నలంద, విక్రమశిల రెండు గొప్ప పురాతన విశ్వవిద్యాలయాలను కాల్చివేసి టిబెట్‌కు తరలించిన సమయంలో భద్రపరిచిన అసలైన బౌద్ధ మాన్యుస్క్రిప్ట్ ల అనువాదం.. ప్రచురణ కోసం రాష్ట్ర ప్రభుత్వం CIHTSతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

ఈ విలువైన మాన్యుస్క్రిప్ట్ లను సాంకృత్యాయన్ తిరిగి దేశానికి తీసుకువచ్చారు. ఇప్పుడు పాట్నా మ్యూజియంలో వాటిని ఉంచారు. మాన్యుస్క్రిప్ట్ లను హిందీలోకి అనువదించి వాటిని ప్రచురించే పని ఐదేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. క్రీ.శ. ఏడవ, 12వ శతాబ్దాల మధ్య రెండు విశ్వవిద్యాలయాల పండితులచే మాన్యుస్క్రిప్ట్ లు సంస్కృతంలో రాయడం జరిగింది. సాంకృత్యాయన్ తీసుకొచ్చిన అసలైన బౌద్ధ మాన్యుస్క్రిప్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం భద్రపరచాలని డిమాండ్ చేస్తూ దుమ్రాన్‌లోని సీపీఐ (ఎంఎల్) ఎమ్మెల్యే అజిత్ కుమార్ సింగ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అంతేకాకుండా షెహనాయ్ ప్లేయర్ భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌కు అంకితం చేసిన స్మారకాన్ని డుమ్రాన్‌లోని అతని స్వస్థలంలో నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement