Monday, November 18, 2024

యాంక‌ర్, న‌టి సుమ బ‌ర్త్ డే – ఆమె గురించి ప‌లు విష‌యాలు

తెలుగు యాంక‌ర్ల‌ల‌లో స్టార్ యాంక‌ర్ ఎవ‌రంటే అంద‌రూ ఠ‌క్కున చెప్పే పేరు సుమ‌. తెలుగు బిడ్డ కాక‌పోయినా తెలుగుని స్ప‌ష్టంగా మాట్లాడ‌టంలో ఆమెకి ఆమె సాటి…ఆమెకి లేరిక పోటీ అనే విధంగా యాంక‌రింగ్ ఫీల్డ్ లో త‌న‌దైనశైలిలో దూసుకుపోతోంది. యాంక‌రింగ్ లో సుమ స్టైలే వేరు.. ఆమె న‌వ్విస్తూనే ఆలోచింప జేస్తారు. భాష‌పై ప్రేమ పెంచుతారు. మ‌న‌ది కాని సంప్ర‌దాయం నుంచి వ‌చ్చి..మ‌న సంప్ర‌దాయాల విలువేంటో చాటి చెబుతారు. నేడు ఆమె పుట్టిన‌రోజు. బుల్లితెర మ‌హ‌రాణి సుమ అని నిరూపించింది. మాట‌ల్లోనూ న‌వ్వుల్లోనూ ప్ర‌త్యేక రీతి ఆమెది అని చాటిచెప్పింది. తెలుగు వారి లోగిళ్ల‌కు ప‌రిచ‌యం అయిన ఆ పేరు ఇప్పుడొక బ‌ల‌మైన ప‌ద బంధంగా మారిపోయింది.భాష ప‌ల‌క‌డం వేరు.. సొంతం చేసుకుని ప‌ల‌క‌డం వేరు..స్థానిక ప‌లుకుబ‌డులు తెలుసుకుని మ‌రీ! మాట్లాడ‌డ‌మే ఓ ప్ర‌త్యేక గుణం. అమ్మ భాష అయితే తెలుగు కాదు..అత్తారింటికి వ‌చ్చాక వ‌చ్చిన,ఇంకా చెప్పాలంటే ఆమె ఖ్యాతినో,కీర్తినో విస్తారం చేసిన చేసేందుకు కార‌ణం అయిన భాష మాత్రం మ‌న తెలుగు అని నిర్థార‌ణ చేయ‌డం ఇవాళ ఇరు ప్రాంతాల వారికీ ఎంతో ఆనంద‌దాయ‌కం.సుమ మలయాళీ అమ్మాయి. అయినప్పటికీ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉండడంతో.. తెలుగు భాషపై పట్టుసాధించింది.

కేరళకు చెందిన సుమ మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడడమే కాదు, బుల్లి తెర యాంకరింగ్‌ చేస్తూ టాప్ యాంకర్ గా గత కొన్నేళ్లుగా కెరీర్ లో దూసుకుపోతుంది. సుమ లేని ఆడియో ఫంక్ష‌న్ లేదు..సినిమా రిలీజ్ లేదు అన్నంత‌గా పేరు తెచ్చుకుంది. ఇక సుమ‌ లేకుండా నా సినిమాను విడుద‌ల చేయ‌డ‌మా! జ‌ర‌గ‌ని ప‌ని అని రీసెంట్ గా అన్నారు దిగ్గజ ద‌ర్శ‌కులు రాజ‌మౌళి. సుమకు చాద‌స్తం ఎక్కువ .. రాబోయే రోజుల్లో వెండి తెర‌పై ఆమెను నిర్మ‌ల‌మ్మ, ఛాయాదేవీ లాంటి పాత్ర‌ల‌లో చూడాల‌నుకుంటున్నాను నేను అని అంటారు తార‌క్.

బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటి టాప్ యాంకర్.. తాను చిన్నతనంలో క్లాసికల్ డ్యాన్స్, సంగీతం నేర్చుకున్నానని సుమ చాలా సార్లు ప్రేక్షకులతో తన చిన్నతనం రోజులను పంచుకుంది.. వాస్తవానికి సుమ బుల్లి తెరపై కొన్ని సీరియల్స్ లో నటించింది.. కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడు లో ఎంట్రీ ఇచ్చింది. దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్ లో నటిస్తున్న సమయంలో రాజీవ్ కనకాలతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.. సుమ రాజీవ్ పెళ్లి 1999, ఫిబ్రవరి 10న జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఇక సుమ ఇటీవల గాయనిగా కూడా మారింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఓ సినిమా లో అనసూయ స్పెషల్ సాంగ్ కి డ్యాన్స్ చేయగా సుమ ఆ పాటను పాడింది. తమన్ ఆమెతో పాడించాడు. యాంకర్ గా ఎంతో ఎత్తు చేరుకున్న సుమ కనకాల ఇటువంటి పుట్టిన రోజులు అనేకం చేసుకోవాలని కోరుకుంటోంది ఆంధ్ర‌ప్ర‌భ‌.త్వ‌ర‌లోనే జ‌య‌మ్మ పంచాయ‌తీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సుమ పుట్టిన రోజు ఇవాళ ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement