బిగ్ బాస్ 5లో ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అనే విధంగా సాగుతోంది. వారం వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో ముందే ఊహించే ప్రేక్షకుల ఊహకందని ఎలిమినేషన్ జరిగింది. యాంకర్ , నటుడు రవి ఎలిమినేషన్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు రవి ఎలిమినేషన్ అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అనూహ్యంగా రవి ఎలిమినేట్ అయ్యాడు. రవి విన్నర్ అవుతాడనుకున్న తరుణంలో రవి ఎలిమినేషన్ ఓ ట్విస్ట్ అనే చెప్పాలి. దాంతో కొందరు అభిమానులు బిగ్ బాస్ హౌజ్ వద్ద నిరసనకు దిగారు. యాంకర్ రవికి అన్యాయం జరిగిందంటూ ఆరోపిణిస్తున్నారు. అసలు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రోడ్డు మీదకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ జాగృతి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బిగ్బాస్ చరిత్రలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ఓట్ల విషయంలో అవకతవకలు జరిగాయని నిరసనలు వచ్చిన సందర్భాల్లో బిగ్బాస్ నిర్వాహకులు స్పందించలేదు. మరి ఇప్పుడైనా ఈ వ్యవహారంపై స్పందిస్తారో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..