ఆయనో జిల్లాకు కలెక్టర్ కాని పలుగు చేతబట్టి కార్మికుడిలా పనిచేశాడు. కలెక్టర్ స్థాయిలో ఉన్నప్పటికి కూలీలతో కలిసిపోయారు. వారితో పనిచేసి వారిలో ఉత్సాహం నింపారు అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు. మాటామంతి కలిపి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. క్రమం తప్పకుండా డబ్బులు అందజేస్తున్నారా అంటూ ఉపాధి కూలీలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల కల్పనలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కూలీలకు మజ్జిగ అందజేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్.
Advertisement
తాజా వార్తలు
Advertisement