కొవిడ్,ఒమిక్రాన్ మందుల తయారీ,ఎగుమతులను వెంటనే నిలిపివేయాలని ఆనందయ్యకి ఆదేశాలు జారీ చేసింది. ఆయుర్వేద మందుతో ఒమిక్రాన్ ను నయం చేస్తానని ప్రకటించడంపై ఆనందయ్యని , ఆయుష్ వివరణ కోరింది. కాగా 48గంటల్లో ఒమిక్రాన్ ను నయం చేస్తానని ఆనందయ్య ప్రకటించారని, ఈ ప్రకటన చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది. 48 గంటల్లో ఒమిక్రాన్‌ను ఎలా నయం చేస్తారో ఆధారాలను చూపించాలన్న ఆదేశించింది. సకాలంలో వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఆనందయ్య మందులను ఆయుర్వేద మందులుగా ప్రకటించుకోవడం సరికాదని.. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌కు మందుల అనుమతి కోసం ఆనందయ్య ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని ఆయుష్ పేర్కొంది.మరి ఆనందయ్య ఆయుష్ ఆదేశాలపై ఎలా స్పందిస్తారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..