నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయుర్వేద మందుతో ఆనందయ్య ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన తయారు చేసిన ఆయుర్వేద మందపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర, జాతీయ వార్తా కథనాలు మొత్తం ఆయన చుట్టే తిరుగుతున్నాయి. ఆనందయ్య మందు కోసం ఏపీ సహా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ప్రజల తాకిడి ఎక్కువ కావడంతో మందు పంపిణీని ప్రస్తుతం నిలిపివేసినా కూడా ప్రజలు అక్కడికి వస్తున్నారు. అయితే, ఇదే అదునుగా చెలరేగిపోతున్నారు కేటుగాళ్లు.
ఆనందయ్య తయారు చేసిన కరోనా ఆయుర్వేద మందు ఇదే అంటూ బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. అష్టకష్టాలుపడి అక్కడివరకు వచ్చిన ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఒక్కో ప్యాకెట్‌కు రూ. 3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆనందయ్య దగ్గర కరోనా మందు కోసం క్యూలో పడిగాపులు పడ్డా మందు దొరకపోవడంతో బాధితులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘కరోనా దేవి’ ఆలయం.. ప్రత్యేక ఏంటో తెలుసా?