మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారులో ఇవ్వాల తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రోడ్డుమీద నుంచి వెళ్తున్న బర్రెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెట్టుకు ఢీకొట్టాడు. దీంతో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్నవారిలో 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గట్టిగా బస్సు ఢీకొట్టడంతో బర్రె అక్కడికక్కడే చనిపోయింది. బస్సు బోల్తా పడి ఉంటే పెను ప్రమాదం జరిగేదని చూసిన వాళ్లు అనుకుంటున్నారు. అయితే ఈ బస్సు కామారెడ్డి డిపోకు చెందినదని, కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు.
బర్రెను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
Advertisement
తాజా వార్తలు
Advertisement