పాటకు, ప్రకృతికి విడదీయరాని బంధం ఉందని, అందుకే తాను గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొంటున్నట్టు చెప్పారు బాలీవుడ్ సింగర్ శ్రేయాఘోషల్. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో సింగర్ శ్రేయా ఘోషల్ పాల్గొన్నారు. ఇవ్వాల (సోమవారం) ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని గచ్చిబౌలిలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ గొప్ప కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మొక్కలు పెంచడం, తద్వారా పచ్చదనాన్ని పెంపొందించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రకృతికి, పాటకు మధ్య విడదీయరాని అనుబంధం ఉందని, రెండింటి సామరస్యంతో సంపూర్ణ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటామని సింగర్ శ్రేయాఘోషల్ అన్నారు.
‘గ్రీన్ ఇండియా యాలెంజ్’ వంటి మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు రాజ్యసభ సభ్యుడు జోగిపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ని మరో ముగ్గురికి ట్విట్టర్ ద్వారా శ్రేయా ఘోషల్ చాలెంజ్ విసిరారు. కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ సంస్థ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవేందర్ యాదవ్ పాల్గొన్నారు.