Tuesday, November 19, 2024

అమ‌రావ‌తి రైతుల‌కు : శ్రీవారి ద‌ర్శ‌నానికి ప‌ర్మిష‌న్

శ్రీవారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిని ఇచ్చింది టిటిడి. రేపు ఒక్క‌రోజే 5వంద‌ల మంది రైతులు స్వామివారి ద‌ర్శ‌నాన్ని చేసుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఈ మేర‌కు కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌ని స‌రి అని అమ‌రావ‌తి రైతుల‌కి తెలిపింది టిటిడి. న‌వంబ‌ర్ 1న అమ‌రావ‌తి రైతుల యాత్ర తూళ్లూరు నుండి ప్రారంభించారు. కాగా నేడు వారి యాత్ర 44వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టారు.

నేడు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 400 కిలోమీటర్లకు పైగా వీరి యాత్ర కొనసాగింది. ప్రస్తుతం తిరుపతిలో రైతుల యాత్ర కొనసాగుతోంది. నేటి సాయంత్రం అలిపిరి వద్ద వీరి పాదయాత్ర ముగియనుంది. దాంతో రేపు వీరంతా శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఈ నెల 17న తిరుపతిలో అమరావతి రైతులు బహిరంగసభను నిర్వహించడానికి స‌న్నాహాలు చేప‌ట్టారు. ఈ సభకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ వీరు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంకా ఈ విష‌య‌మై స్ప‌ష్ట‌త రాలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement