Friday, November 22, 2024

ఫీచర్​ ఫోన్ల నుంచి కూడా అమౌంట్​ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.. ఎట్లనో తెలుసా?

ఫోన్ నుంచి డ‌బ్బులు పంపించాలంటే అది కేవ‌లం స్మార్ట్ ఫోన్ లో ఉండే ప్రత్యేకమైన యాప్​ల ద్వారా మాత్రమే సాధ్యం. దానికి కూడా ఇంట‌ర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. కానీ, దేశంలో స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ల సంఖ్య కంటే ఫీచ‌ర్ ఫోన్ వాడే క‌స్ట‌మ‌ర్ల సంఖ్యే ఎక్కువ‌గా ఉంది. దాదాపు 40 కోట్ల మంది ఇండియ‌న్స్ ఇప్పటికీ ఫీచ‌ర్ ఫోన్ వాడుతున్నారు. అటువంటి వాళ్లు కూడా త‌మ ఫోన్ ద్వారా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే చాన్స్​ని తాజాగా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ ప్రారంభించారు. దానికి 123పే అనే పేరు పెట్టారు. యూపీఐ ద్వారా ఈ స‌ర్వీస్‌ను ఉప‌యోగించి ఫీచ‌ర్ ఫోన్ల నుంచి డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఫీచ‌ర్ ఫోన్ల‌లో ఎటువంటి ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ లేకున్నా 123పే అనే స‌ర్వీస్‌ను ఉప‌యోగించి డ‌బ్బులు పంపించుకోవ‌చ్చు.

ఫీచ‌ర్ ఫోన్ల ద్వారా లావాదేవీల‌ను యాక్సెప్ట్ చేయాలంటే దాని కోసం నాలుగు ర‌కాల టెక్నాల‌జీల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఐవీఆర్ (ఇంట‌రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్‌) నెంబ‌ర్, యాప్ ఫంక్ష‌నాలిటీ, మిస్‌డ్ కాల్ విధానం, ప్రాక్సిమిటీ సౌండ్ బేస్డ్ పేమెంట్స్ ద్వారా ఈ స‌ర్వీస్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ స‌ర్వీస్ ద్వారా పేమెంట్స్‌తో పాటు యుటిలిటీ బిల్స్ కూడా పే చేయవచ్చు. వాహ‌నాల ఫాస్ట్ ట్యాగ్స్ రీచార్జ్ చేసుకోవ‌చ్చు. మొబైల్ బిల్స్ పే చేసుకోవ‌చ్చు. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. దాని కోసం ఫీచ‌ర్ ఫోన్ క‌స్ట‌మ‌ర్లు బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ పిన్‌ను సెట్ చేసుకోవాలి. ఫీచ‌ర్ ఫోన్ ద్వారా డిజిట‌ల్ పేమెంట్స్ ఆప్ష‌న్‌ను వాడే క‌స్ట‌మ‌ర్ల కోసం 24 గంట‌ల హెల్ప్‌లైన్ స‌ర్వీస్‌ను నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. డిజిసాతీ పేరుతో ఎన్‌పీసీఐ తీసుకొచ్చిన హెల్ప్‌లైన్ స‌ర్వీస్‌ను వినియోగించుకోవాల‌నుకునే వాళ్లు.. Digisaathi వెబ్‌సైట్‌లోకి కానీ 14431, 1800 891 3333 క‌స్ట‌మ‌ర్ కేర్ నెంబ‌ర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు..

Advertisement

తాజా వార్తలు

Advertisement