బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ‘జుండ్’ చిత్రంతో అలరించనున్నారు. ఈ మూవీలో బిగ్ బి ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నారు. ఇటీవల విడులైన ఈ సినిమా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఈ సినిమా విషయంలో అమితాబ్ బచ్చన్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. అమితాబ్ బచ్చన్ తన పారితోషికాన్ని తగ్గించుకుని పెద్ద మనసు చూపారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు.
జుండ్ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ కారణంగా నిర్మాతలు బడ్జెట్ కు సంబంధించి ఇబ్బంది పడుతున్నట్టు అమితాబ్ తెలుసుకున్నారు. దీంతో తన పారితోషికాన్ని తగ్గించుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు అమితాబ్ చెప్పారు. ఫుట్ బాల్ ను స్వతహాగా ఇష్టపడే అమితాబ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను ఎంతో ఇష్టపడినట్టు సందీప్ సింగ్ తెలిపారు. నచ్చిన సినిమా కావడంతో నిర్మాతల కష్టాలను గుర్తించిన అమితాబ్ పారితోషికాన్ని తగ్గించేకునేందుకు సిద్ధమైయ్యారు. ‘‘నాపై ఖర్చు చేసే బదులు దానిని సినిమా నిర్మాణంపై వెచ్చించండి’’ అని అమితాబ్ అన్నట్టు సందీప్ సింగ్ తెలిపారు. కాగా, టీ సిరీస్ సంస్థ జుండ్ నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు అంగీకరించడంతో మొత్తానికి ఈ సినిమా ఆర్థిక కష్టాలకు చెక్ పడింది.
Jhund: పారితోషికాన్ని తగ్గించుకున్న అమితాబ్.. కారణం ఏంటంటే..
Advertisement
తాజా వార్తలు
Advertisement