యువకులు పొగాకుకు అలవాటు పడకుండా చేయడంలో సహాయపడటానికి పాన్ మసాలా బ్రాండ్ ప్రచారం మానుకోవాలని జాతీయ పొగాకు వ్యతిరేకసంస్థ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ను అభ్యర్థించింది. దాంతో అక్టోబర్‌లో కమ్లా పసంద్ ప్రచారం నుండి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతెో ఈ ప్రకటనల ప్రసారం రద్దు చేయాలని ‘కమలా పసంద్’ పాన్ మసాల బ్రాండ్‌కు అమితా బచ్చన్ కార్యాలయం నుంచి లీగల్ నోటీస్ వెళ్లింది. ఇకపై పాన్ మసాల బ్రాండ్ ప్రమోషన్లతో అమితాబ్ బచ్చన్‌కు సంబంధం లేదని అక్టోబర్‌లో అమితాబ్ బచ్చన్ కార్యాలయం పోస్ట్ చేసింది.అమితాబ్, పాన్ మసాల బ్రాండ్ ప్రకటన ప్రసారం అయిన కొన్ని రోజులకు అందులోనుంచి వైదొలిగారు. ఎందుకంటే ఒప్పందం చేసుకునేప్పుడు, అది సర్రోగేట్ అడ్వర్టైజింగ్ కిందకు వస్తుందని తెలియదు. అమితాబ్ బచ్చన్ ఈ బ్రాండ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ప్రమోషన్ కోసం తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చారు.’ అని పోస్టులో పేర్కొంది. ఈ పాన్ మసాల బ్రాండ్ ప్రకటనలో నటించిన కారణంగా 79 ఏళ్ల అమితాబ్ బచ్చన్‌కు పలు ఎదురుదెబ్బలు తగిలాయి. స్క్రీన్ ఐకాన్‌కు చెందిన పలువురు అభిమానులు ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి అమితాబ్ ఎలా ఒప్పుకున్నారని అసంతృప్తి వ్యక్తపరిచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement