Tuesday, November 19, 2024

Amit shah : అమిత్ షా ఖమ్మం పర్యటన వాయిదా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికారికంగా ప్రకటించారు. బిపర్ జోయ్ తుఫాన్ దృష్ట్యా అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు తెలిపారు. ఖమ్మంలో అమిత్ షా పర్యటన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని బండి సంజయ్ తెలిపారు.

బిపర్‌జాయ్ తుపాను తీవ్ర రూపం దాల్చటంతో దీనిపై ఉన్నత స్థాయి సమీక్షలు, అధికార యంత్రాంగంతో నిరంతం అందుబాటులో ఉండి సహాయక చర్యల ఆదేశాలకు రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో షా ఆ పనుల్లో బిజీగా ఉండాల్సి రావటంతో తెలంగాణ పర్యటన మరోసారి రద్దు అయ్యింది. షా తెలంగాణ పర్యటనలో భాగంగా నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కావటం కూడా షెడ్యూల్ లో భాగంగా ఉంది. దీంట్లో భాగంగానే ప్రముఖ సినీ దర్భకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ తో కూడా సమావేశం కావాల్సి ఉంది. కానీ పర్యటన రద్దుతో ఈ సమావేశాలు కూడా క్యాన్సిల్ కానున్నట్లుగా తెలుస్తోంది. టూర్ షెడ్యూల్ ప్రకారం షా బుధవారం అర్ధరాత్రికి హైదరాబాద్ రావాల్సి వుంది. కానీ ఈ పర్యటన రద్దు కావటంతో షా ఢిల్లీకి వెళ్లిపోనున్నారు.

నాలుగోసారి పర్యటన వాయిదా..

- Advertisement -

దీంతో పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా మంచిర్యాల పర్యటన, సంగారెడ్డిలో మేధావులతో జరగాల్సిన అమిత్ షా సమావేశం చివరి నిమిషంలో రద్దు అయ్యింది. అలాగే మే 27న యోగా దినోత్సవ సన్నాహకా సభను ఆఖరి నిమిషంలో రద్దు చేసుకున్నారు షా. తాజాగా తుఫాన్ కారణంగా రేపటి ఖమ్మం సభ కూడా రద్దు అయ్యింది. ఇలా తెలంగాణలో అమిత్ షా పర్యటనల వరుస రద్దుతో బీజేపీ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ క్రమంలో షా మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తారా? వస్తే ఎప్పుడు? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement