కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కుమారుడు జైషా ప్రస్తుతం బీసీసీఐ సెక్రెటరీగా ఉన్నాడు. అంతేకాకుండా ఆసియా క్రికెట్ మండలి ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే తను సెప్టెంబర్ 2019లో బీసీసీఐ సెక్రెటరీగా నియమింపబడ్డాడు. ప్రస్తుతం పనిచేసిన వారందరిలోకెల్లా అతి తక్కువ వయసున్న వ్యక్తిగా జైషా ఉన్నాడు. అతని ఎంపిక కూడా రాజకీయ ప్రలోభాలతో జరిగిందన్న ఆరోపణలున్నాయి. కాగా జైషా పదవీ కాలం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. దీంతో తన పదవి కాలాన్ని పొడిగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
అయితే.. ప్రస్తుతం దేశంలోని యువత ఆర్మీలో చేరాలంటే అగ్నిపథ్ పథకం ద్వారా మాత్రమే చాన్స్ ఉంటుందని, దీనికోసం నాలుగేళ్ల తర్వాత రిటైర్‌మెంట్ తీసుకుని ఆ తర్వాత బీజేపీ ఆఫీసుల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా చేయాలని కొంతమంది బీజేపీ లీడర్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమిత్‌షా ముద్దుల కొడుక్కు అత్యున్నత పదువులు కావాలే.. మళ్లీ వాటిని పొడిగించుకునేందుకు సుప్రీం కోర్టుకు వెళతారు.. కానీ, సామాన్యులు మాత్రం సెక్యూరిటీ గార్డులుగా ఉండాలా? అని ఇప్పుడు దేశవ్యాప్తంగా యువత ప్రశ్నిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో డిఫరెంట్ ఇమేజెస్‌తో కూడిన మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఇక్కడ చూడొచ్చు.